Kapra: భక్తిశ్రద్ధలతో లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

Kapra: కాప్రాలోని 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

Update: 2026-04-11 14:45 GMT

Kapra: భక్తిశ్రద్ధలతో లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

Kapra: కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా గ్రామంలో 300 సంవత్సరాల చరిత్ర గల కాప్రా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించారు. శనివారం ఉదయం సుప్రభాత సేవ వేద పారాయణం బాల భోగం నివేదన శాంతి పాఠం యాగశాల ఆరాధనలు శ్రీ లక్ష్మీ సుదర్శన హవనం అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.

సాయంత్రం నవగ్రహ రుద్రహవ్వనం నిత్య పూర్ణాహుతి అన్న వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈనెల 12 ఆదివారం చండీ హవనం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి శివమామేశ్వర స్వామి శ్రీ భువనేశ్వర్ దేవి వాళ్లకు శతకలశాభిషేకం లతోపాటు జయ విజయ ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ సభ్యులు పొట్టు బాబురావు పడమటి మల్లారెడ్డి నరేందర్ గౌడ్ తెలిపారు,

ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అంజిరెడ్డి, కే సీతారాం రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ అధ్యక్షులు జ్యోతిర్మయాచారి లను ఈ సందర్భంగా ఆశీర్వచన సత్కారం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు రవి మూర్తి శర్మ సమక్షంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ ఆలయ కమిటీ ఓ కృష్ణమాచార్యులు, శ్రీనివాస్, కాలే కమిటీ సభ్యులు ఊర్ల శ్రీధర్ రెడ్డి గుడి సత్యనారాయణ పబ్బతి నరేందర్ గౌడ్, ఈ కళ్యాణ మహోత్సవంలో హాజరయ్యారు.

Tags:    

Similar News