Anakapalli: అనకాపల్లిలో పూలే విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల

Anakapalli: అనకాపల్లి అంబేద్కర్ హైస్కూల్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 15:52 GMT

Anakapalli: అనకాపల్లిలో పూలే విగ్రహావిష్కరణ.. పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల

Anakapalli: స్థానిక భీముని గుమ్మం వద్ద గల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హైస్కూల్‌లో ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు కలిసి ఆవిష్కరించారు. అనంతరం జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తితో కలిసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్ అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కొణతాల రత్నకుమారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రీ బాబి, 80వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ బి.ఎస్.ఎం.కె. జోగి నాయుడు, 83వ వార్డు జనసేన ఇన్‌ఛార్జ్ మంగ ఈశ్వర్, 82వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జ్ పోలవరపు త్రినాథ్ మరియు ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

​అలాగే సంఘం ముఖ్య సలహాదారులు మైలిపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి పోతల శ్రీనివాసరావు, కోశాధికారి పందిరి దయాల్ రాజు, ప్రతినిధులు సమ్మింగి కనకారావు, సిమిటి రామకృష్ణ, బెల్లాన శ్రీను, గొర్లి నూకరాజు, మాదల విజయ్‌లతో పాటు ఆది ఆంధ్ర సంఘ కార్యవర్గ సభ్యులు, జై భీమ్ యూత్ సభ్యులు మరియు జిల్లా దళిత సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలే ఆశయాలను స్మరించుకున్నారు.

Tags:    

Similar News