Giddalur: టీడీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే వేడుకలు

Giddalur: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 13:33 GMT

Giddalur: టీడీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే వేడుకలు

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు పూల మాలవేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి రావు పూలే గారి గురించి గౌ " ఎమ్మెల్యే గారు వివరిస్తూ మహాత్మా జ్యోతీరావ్ ఫులే (1827–1890) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ సామాజిక సంస్కర్త, విద్యావేత్త మరియు కుల వ్యతిరేక ఉద్యమకారుడు.

అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు, అలాగే మహిళలు, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. తన భార్య సావిత్రిబాయి ఫులేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు.

జ్యోతీరావ్ ఫులే ముఖ్య వివరాలు:

జననం: 11 ఏప్రిల్ 1827, పూణే, మహారాష్ట్ర. సామాజిక కృషి: కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం పోరాడారు. స్త్రీ విద్య మరియు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు.

సత్యశోధక్ సమాజ్: అణగారిన వర్గాల హక్కుల కోసం 1873లో 'సత్యశోధక్ సమాజ్' (సత్య శోధకుల సమాజం)ను స్థాపించారు.

మహాత్మా బిరుదు: సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో ఆయనకు 'మహాత్మా' అనే బిరుదు లభించిది.

జ్యోతి రావు పూలే గారు 28 నవంబర్ 1890 లో మరణించారు అని తెలిపారు. ఈ జయంతి వేడుకలో నియోజకవర్గ, మండల పార్టీ అధ్యక్షులు , పట్టణ కౌన్సిలర్ లు, నాయకులు, BC నాయకులు తదితరులు జయంతి వేడుకలో పాల్గొన్నారు.

Tags:    

Similar News