Nellore: బాధితులపై లాఠీచార్జీ చేస్తారా.. వైఎస్ఆర్సీపీ నిరసన
Nellore: ఏపీలో మహిళలకు రక్షణ లేదని, కూటమి నేతలే వేధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత కాకాణి పూజిత విమర్శించారు.
Nellore: బాధితులపై లాఠీచార్జీ చేస్తారా.. వైఎస్ఆర్సీపీ నిరసన
Nellore: ఏపీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, మహిళల రక్షణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సిపి మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. నెల్లూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని, చంద్రబాబు న్యాయం చేస్తాడని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలు మరువకముందే మరో జనసేన జెడ్పీటీసీ వేధింపులు వెలుగుచూశాయని చెప్పారు. కూటమి ప్రజా ప్రతినిధులే మహిళలను వేధిస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయని,
వైయస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలో రామ కీర్తన అనే ఇంటర్ విద్యార్థినిని ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా ఫలితం లేదని చెప్పారు. పైగా బాధిత కుటుంబ సభ్యులపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గం అని చెప్పారు. షర్మిల నోట చంద్రబాబు పలుకులు.
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ వైయస్ జగన్ ప్లాన్ -బిగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారని, దానిపై ప్రజల్లో చర్చ జరిగి మంచి స్పందన రావడంతో చంద్రబాబు తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారని చెప్పారు.. ఇవన్నీ చూస్తుంటే ఆడవాళ్లంటేనే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది.
మహిళగా ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా షర్మిల మావిగన్ ని హేళన చేయడం, హేయమైన చర్యగా చెప్పారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ కూటమి పలుకులను పలుకుతున్నారని రాష్ట్ర ప్రజలే అంటున్నారని. తన వ్యక్తిగత స్వార్థం కోసం వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలను చేస్తున్న చంద్రబాబుకి వంతపాడటం సిగ్గుచేటని చెప్పారు.
అమరావతి అవినీతి గురించి ప్రజల్లో చర్చ జరగకుండా షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరెన్ని మాట్లాడినా వైయస్ జగన్ గారికి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయలేరని చెప్పారు. అన్నగా వైయస్ జగన్ అండగా ఉన్నారనే ధీమా, నమ్మకం రాష్ట్ర మహిళల్లో ఉందని కాకాణి పూజిత స్పష్టం చేశారు.