Vizag: స్త్రీ విద్యకు పూలే ఆద్యుడు.. రైతుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే!

Vizag: విశాఖపట్నం జగదంబ జంక్షన్ కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు.

Update: 2026-04-11 09:18 GMT

Vizag: స్త్రీ విద్యకు పూలే ఆద్యుడు.. రైతుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే!

Vizag: సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను విశాఖపట్నం జగదంబ జంక్షన్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హాసిని వర్మ మాట్లాడుతూ. అణగారిన వర్గాల హక్కుల కోసం సత్యశోధక్ సమాజ్ స్థాపించి అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన తోడ్పడ్డారని గుర్తుచేశారు.

1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించిన ఘనత ఆయనదేనని, సావిత్రిబాయి పూలేతో కలిసి స్త్రీ విద్యకు మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సైతం పూలేను తన గురువుగా భావించారని ఈసందర్భంగా గుర్తు చేశారు. భీమిలి నియోజకవర్గ సమన్వయ కర్త , సవరివిల్లి రామకృష్ణ మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలనకు,మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఈ రోజు నిర్వీర్యం అవుతుంది..కేంద్రం లో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చే హామీల నెరవేర్పును గాలికి వదిలేశారని, ఈ రోజు రైతులకు సబ్సిడీలు లేకుండా రైతుల నడ్డి విరిచేశారని, రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అటువంటి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని తెలిపారు.

చివరిగా రైతులు మాట్లాడుతూ రైతులు పడుతున్న కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు వివరించారు ఈనాడు ఎరువులు వ్యవసాయానికి కావలసిన పనిముట్లు, సామగ్రి ధరలు పెరిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వాలు మారిన రైతుల బ్రతుకులు మాత్రం మారటం లేదని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కండవ గాయత్రి,రెడ్డి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ప్రియాంక దండి, దక్షిణ నియోజకవర్గ సమన్వయ కర్త కే వి సూర్యనారాయణ,మధుసూదన్, జగన్, సీనియర్ నాయకులు త్రినాథ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతం, జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనంద్ కుమార్,బ్రహ్మం, సీనియర్ నాయకులు విజయకుమార్, సరస్వతి, సేవాదళ్ అప్పారావు, రజనీ, శ్రీధర్ 28 వార్డు ప్రెసిడెంట్ గుర్రం కనకరావు పలువురు మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Tags:    

Similar News