Devanakonda: టీడీపీ కార్యాలయంలో పూలే వేడుకలు సామాజిక విప్లవకారుడికి ఘన నివాళి

Devanakonda: దేవనకొండ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 09:08 GMT

Devanakonda: టీడీపీ కార్యాలయంలో పూలే వేడుకలు సామాజిక విప్లవకారుడికి ఘన నివాళి

Devanakonda: మహానీయ సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దేవనకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడినవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చేర్మెన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన మహోన్నత సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పూలే గారి సమానత్వ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, పేదల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

అలాగే పూలే గారి ఆశయాలకు విరుద్ధంగా పని చేసిన ,చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని, సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో , కార్యకర్తలు మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు, మాజీ జడ్పీటీసీ ఉచిరప్ప రామారావు నాయుడు, అలారుదిన్నె మల్లయ్య, మల్లికార్జున గౌడ్, డీలర్ బండ్లయ్య, నగిరి సుభాన్, కాకర్ల శాంత కుమార్, రాజా సాహెబ్, సురేంద్ర గౌడ్, రమేష్ నాయుడు, దస్తగిరి నాయుడు నాగేష్ గౌడ్ పొట్లపాడు వెంకటేశ్వర్లు చిన్న వేంకప్ప కొలంట్ల తిమ్మప్ప షేకన్న చిన్న మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News