Nandyal: పూలే స్ఫూర్తితోనే పాలన.. బనగానపల్లెలో నివాళులర్పించిన మంత్రి
Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
Nandyal: పూలే స్ఫూర్తితోనే పాలన.. బనగానపల్లెలో నివాళులర్పించిన మంత్రి
నంద్యాల జిల్లా: సామాజిక విప్లవకారుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహాత్మ జ్యోతిరావు ఫూలే 200 వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించిన మంత్రి పూలే అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారుడని కొనియాడిన మంత్రి దేశంలో మహిళా విద్య కోసం తొలి పాఠశాలను స్థాపించిన ఘనత జ్యోతిరావు పూలే - సావిత్రిబాయి పూలే దంపతులకే దక్కుతుంది.
కుల వివక్షకు వ్యతిరేకంగా ఫూలే పోరాట స్ఫూర్తి నేటికీ సమాజానికి అవసరం. ఫూలే ఆశయాల బాటలో నేటి కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంది
పూలే స్ఫూర్తితో బలహీన వర్గాలకు అండగా కూటమి ప్రభుత్వ నిలుస్తుంది. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తోడ్పాటు అందించిన పార్టీ తెలుగుదేశం ఈ ఏడాది బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రూ. 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను కుదించి అన్యాయం చేశారు. ఈ ఏడాది బీసీ సబ్ ప్లాన్ కింద రూ 15 వేల కోట్ల నిధులు ఖర్చుపై చేశాం, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పనకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం.
కార్యక్రమంలో యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బండి మౌలిశ్వర్ రెడ్డి రామశేఖర్ ఇస్మాయిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు