Panyam: నియోజకవర్గ అభివృద్ధి 'న్యూస్ లెటర్' ఆవిష్కరణ
Panyam: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ (CVAP) సమీక్షా సమావేశం జరిగింది.
Panyam: నియోజకవర్గ అభివృద్ధి 'న్యూస్ లెటర్' ఆవిష్కరణ
Panyam: పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన CVAP( Constituency Vision Action Plan Unit) సమీక్ష సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి Dy CEO, ZP KNL శ్రీ E.V సుబ్బారెడ్డి మరియు పాణ్యం నియోజకవర్గా CVAP బృందం పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన P4 కార్యక్రమ పురోగతి, వివిధ శాఖల Key Performance Indicators (KPIs), బడ్జెట్ కేటాయింపులు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు తదనంతరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే న్యూస్ లెటర్ ను ఆవిష్కరించారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో అమలు అవుతున్న పథకాల స్థితి, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, పనుల వేగవంతం, నాణ్యత మరియు పారదర్శకతపై సమీక్ష నిర్వహించారు.
అలాగే శాఖల వారీగా లక్ష్యాలు మరియు సాధనలపై విశ్లేషణ చేసి, వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుండి అందిన వినతులు, ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పథకాల అమలులో సమన్వయం పెంపొందించి, ప్రతి అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. అలాగే పనితీరు మెరుగుపర్చడంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.