Razole: పద్ధతి మార్చుకోండి.. పాలకులకు రాపాక హెచ్చరిక
Razole: రాజోలులో విభజించు - పాలించు రాజకీయం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు విమర్శించారు.
Razole: పద్ధతి మార్చుకోండి.. పాలకులకు రాపాక హెచ్చరిక
Razole: మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు నివాసంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 135 వ జయంతి ఉత్సవాలు మూడు రోజులు ముందుగా ఘనంగా నిర్వహించారు. వరప్రసాద్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి మరికొందరు ఎస్సీ ముఖ్య నేతలు సహా రెండు వేల మంది అభిమానులు హాజరు కాగా. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ. కొందరి కుతంత్రాలు వల్ల రాజోలు నియోజకవర్గ ఎస్సీ సంక్షేమ సంఘంలో వర్ఖ విభేదాలు ఏర్పడి రెండుగా చీలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఎక్కడా ఎస్సీల మధ్య విభేదాలు రాలేదన్నారు.ఇది కేవలం ప్రస్తుత పాలకుల కుతంత్రాలు వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.అనంతరం రాజోలు నియోజకవర్గ అంబేడ్కర్ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.తనను అంబేడ్కర్ జయంతి చేయకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించారని,అది ఎవరికీ సాధ్యం కాదన్నారు.తనకేమీ కేసులు కొత్త కాదని. దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు.