Razole: కేడర్ విత్ లీడర్'.. కార్యకర్తలకు గొల్లపల్లి అమూల్య పిలుపు

Razole: రాజోలు మండలం తాటిపాకలో టీడీపీ ఇన్-ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో 24వ వారం 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమం జరిగింది.

Update: 2026-04-10 11:45 GMT

Razole: కేడర్ విత్ లీడర్'.. కార్యకర్తలకు గొల్లపల్లి అమూల్య పిలుపు

Razole: 24 వ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక "కేడర్ విత్ లీడర్" కార్యక్రమం ఈరోజు రాజోలు మండలం తాటిపాక లోని టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, కూటమి శ్రేణుల నుండి వచ్చిన అర్జీలను పార్టీ నాయకులతో కలిసి స్వీకరించారు.

ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ. వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. రాజోలు నియోజకవర్గం పట్ల రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకమైన నిబద్ధతతో ఉందని దానికి నిదర్శనం నిన్న అంతర్వేది దేవస్థానంలో మరియు నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలే నిదర్శనమని ఆమె అన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా రాజోలు అభివృద్ధి కి ఎనలేని కృషి చేస్తు ఎంతో బిజీగా ఉన్న,

అంతర్వేది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, యువనేత నారా లోకేష్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకే అంత నిబద్ధత ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ వేదిక ప్రతి కార్యకర్త మనోభావాలు అర్ధం చేసుకునేందుకు ఒక వేదిక అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొనిపాటి రాజు, రాజోలు మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి అనుచూరి సునీత రామ పురుషోత్తం, మలికిపురం మండలం పార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, సఖినేటిపల్లి మండలం పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మామిడికుదురు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి విత్తనాల జానకిరామ్,

నల్లా పరంకుశరావు, కట్టా సూరిబాబు, పంగం సుధాకర్, కడలి రమేష్, చింతా లక్ష్మి, చింతపల్లి నాగలక్ష్మి, కొత్తపల్లి విజయలక్ష్మి, చెల్లుబోయిన నాగబాబు, చెల్లుబోయిన జయ సూరిబాబు జిల్లెళ్ళ వెంకటేశ్వర్లు, పులగం రమేష్, ఆరుమిల్లి భాను, చిట్టాల సూర్యనారాయణ, అజయ్ బాబు, జిల్లెళ్ళ పావెల్ రెడ్డి తదితర కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News