Kurnool: కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం.. జడ్జి కర్ణం కిషోర్ హెచ్చరిక

Kurnool: కర్నూలు కేవీఆర్ కాలేజీలో ఆహార కల్తీలపై విద్యార్థులకు అవగాహన సదస్సు.

Update: 2026-04-10 10:24 GMT

Kurnool: కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం.. జడ్జి కర్ణం కిషోర్ హెచ్చరిక

Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఆహార కల్తీల శాఖకు మరియు తూనికల కొలతల శాఖకు వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు సంబంధిత అధికారులకు ఆహార కల్తీలపైన విద్యార్థి దశ నుంచి మరియు ఉపాధ్యాయులకు చైతన్య కార్యక్రమము చేయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు కె.వి.ఆర్ కాలేజీలో ఆహార కల్తీలపైన మరియు ఆహార కల్తీలను ఏ విధంగా కనుగొనవలెను ఏ విధముగా కల్తీలు చేస్తారు కల్తీ ఆహారాలు ఏ విధంగా ఉంటాయి కల్తీ లేని ఆహారాలు ఏ విధంగా ఉంటాయి అనేదానిపైన చైతన్య కార్యక్రమాన్ని కెవిఆర్ కాలేజీలో నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినియోగదారుల కోర్టు జడ్జి కర్ణం కిషోర్ మరియు డీఎస్ఓ రాజా రఘువీర్ ఆహార కల్తీ నియంత్రణ అధికారి రాజగోపాల్ రావు తూనికల కొలతల శాఖల అధికారి శ్రీరాములు జిల్లా వినియోగదారుల సంఘాల తరఫున అధికార ప్రతినిధి ఏ శివ మోహన్ రెడ్డి వారు పాల్గొన్నారు. వినియోగదారుల జడ్జి కర్ణం కిషోర్ మాట్లాడుతూ ఈ కాలంలో అన్ని రకాల ఆహార కల్తీలు ఎక్కువైతున్నాయి అందువలన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఆహార కల్తీలపైన ఉక్కు పాదం మోపుతూ ఆహార కల్తిన చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు మరియు శిక్షలు,

కేసులు పెడుతూ నాణ్యమైన ఆహారము ప్రజల్లో రావాలని కృషి చేస్తున్నారు. ఆహార కల్తీలని నియంత్రణ అధికారి రాజగోపాల్ రావు కల్తీలపైన అవగాహన కల్పించడం ఇది సమాజానికి ఎంతో మేలు జరిగే కార్యక్రమం అని తెలిపినారు. డి ఎస్ ఓ రాజా రఘువీర్ వారు మాట్లాడుతూ ఆహార కల్తీలపైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ఉక్కు పాదం మోపుతున్నారు కల్తీలు లేని సమాజం ఉండాలని అందరం కృషి చేయాలని తెలిపినారు. కార్యక్రమానికి సభా అధ్యక్షతగా వినియోగదారుల సంఘాల అధికార ప్రతినిధి అయిన ఏ శివ మోహన్ రెడ్డి నిర్వహించినారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రభు చరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు.

Tags:    

Similar News