Palakonda: పాలకొండ అభివృద్ధికి సుడా నిధులు.. కొరికాన రవికుమార్
Palakonda: పాలకొండ గ్రామ దేవత గారాలమ్మ అమ్మవారిని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ దర్శించుకున్నారు.
Palakonda: పాలకొండ అభివృద్ధికి సుడా నిధులు.. కొరికాన రవికుమార్
Palakonda: మన్యం జిల్లా పాలకొండ గ్రామ దేవత గారాలమ్మ దేవాలయాన్ని శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ దర్శించారు. 72 ఏళ్లుగా శిదిలమైన దేవాలయాన్ని పల్లా కొండలరావు మరియు ఇతర ప్రజల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టడం ఆనందదాయకం అని, గ్రామ దేవత పండగలకు సిద్ధం అవుతున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
సుడా నిధుల ద్వారా పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయకృష్ణ కోరిక మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటికే వీరఘట్టం సెంట్రల్ లైటింగ్ పనులకు సుడా ద్వారా నిధులు కేటాయించామని, పాలకొండ పట్టణానికి ఎంతో ముఖ్యమైన అవసరాల్లో వెంకటరాయని కోనేరు అభివృద్ధి ఒకటి అని అక్కడ పనులు ప్రారంభించామని తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసేందుకు సుడా సిద్ధంగా ఉందని చైర్మన్ కొరికాన రవి తెలిపారు.