Anantapur: పూలే ఆశయాల బాటలో నడవాలి.. కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల పిలుపు

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

Update: 2026-04-11 08:10 GMT

Anantapur: పూలే ఆశయాల బాటలో నడవాలి.. కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల పిలుపు

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మహాత్మా Jyotirao Phule 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనలతో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటరానితనం,కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించడం,మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు ఆయన చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని, ఆయన ఆశయాలను కొనసాగించడం మన బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి, బీఎస్‌ఎన్‌ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు అమరా రామ్మోహన్ చౌదరి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్, టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి షామీర్, పట్టణ అధ్యక్షుడు మాదినేని మురళి, సింగిల్ విండో చైర్మన్ మల్లిపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News