Sri Sathya Sai: వైకాపా కార్యకర్త కుటుంబానికి కేతిరెడ్డి భరోసా.. భౌతిక దేహానికి ఘన నివాళి

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైకాపా కార్యకర్త నారాయణస్వామి అనారోగ్యంతో మృతి చెందారు.

Update: 2026-04-11 05:57 GMT

Sri Sathya Sai: వైకాపా కార్యకర్త కుటుంబానికి కేతిరెడ్డి భరోసా.. భౌతిక దేహానికి ఘన నివాళి

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణం లోని కోటకు చెందిన వైకాపా కార్యకర్త ఎం. నారాయణస్వామి అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం ఉదయం నారాయణ స్వామి భౌతిక దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు జక్క భార్గవ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News