Water Powered Hydrogen Stove: గ్యాస్‌ కష్టాలకు చెక్‌...నీళ్లతో నడిచే గ్యాస్‌స్టవ్‌ వచ్చేసింది

Water Powered Hydrogen Stove: దేశంలో వంటగ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి. కారణం గ్యాస్‌ కొరత. గ్యాస్‌ కొరత నుంచి బయటపడేందుకు వివిధ రకాలైన ఆలోచనలు చేస్తున్నారు.

Update: 2026-04-11 06:58 GMT

Water Powered Hydrogen Stove

Water Powered Hydrogen Stove: దేశంలో వంటగ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి. కారణం గ్యాస్‌ కొరత. గ్యాస్‌ కొరత నుంచి బయటపడేందుకు వివిధ రకాలైన ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఆలోచనల నుంచి వచ్చిందే నీళ్లతో వంట. భారత్‌కు చెందిన గ్రీన్‌వెజ్‌ అనే సంస్థ నీటిని ఇంధనంగా మార్చే హైడ్రోజన్‌ కుక్‌టాప్‌ అనే గ్యాస్‌స్టవ్‌ను పరిచయం చేసింది.

సిలిండర్‌తో పనిలేదు

ఈ స్టవ్‌లో ఉపయోగించే టెక్నాలజీ సూత్రం సులభమైనదే అయినా అద్భుతం. ఎలక్ట్రోలిసిస్ విధానం ద్వారా నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడగొడుతుంది. అందులో హైడ్రోజన్ మంటగా మారి వంటకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రక్రియలో పొగ, కార్బన్ ఉద్గారాలు లేకపోవడం విశేషం. అంటే ఇది పూర్తిగా పర్యావరణ హితమైన పద్ధతి. గ్యాస్‌ అయిపోయింది, గ్యాస్‌ కోసం రోజుల తరబడి వెయిట్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఈ హైడ్రోజన్‌ స్టవ్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది

ఈ స్టవ్‌ సామర్థ్యం కూడా గమనించదగ్గదే. కేవలం 100 మిల్లీ లీటర్ల డిస్టిల్డ్ వాటర్, 1 యూనిట్ విద్యుత్తుతో సుమారు 6 గంటల పాటు వంట చేయవచ్చు. ఇది సాధారణ ఇండక్షన్ స్టవ్‌లతో పోలిస్తే 90% తక్కువ విద్యుత్తు వినియోగిస్తుంది. అంటే విద్యుత్‌ ఖర్చు తక్కువ… ప్రయోజనం ఎక్కువ. అంతేకాదు, ఈ స్టవ్‌ను సోలార్‌ ప్యానల్స్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. ఇంటిపైకప్పుపై సోలార్‌ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్‌ ఖర్చు తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ స్టవ్‌పై ఇనుము, అల్యూమినియం, మట్టి పాత్రలు వేటితోనైనా సరే వంట చేసుకోవచ్చు. సాధారణ గ్యాస్‌ను ఎలా ఉపయోగిస్తామో ఆ విధంగా వాడుకోవచ్చు.

ఖరీదు ఎక్కువే

ఏ వస్తువైనా మార్కెట్లోకి కొత్తగా వచ్చినపుడు దాని ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. డిమాండ్‌ పెరిగే కొలది ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ హైడ్రోజన్‌ స్టవ్‌ ఖరీదు మార్కెట్లో లక్ష నుంచి లక్షా యాభైవేల వరకు ఉన్నది. దీనికి జీఎస్టీ అధనం. సామాన్యులకు అందుబాటులో లేకున్నా హోటల్స్‌, రెస్టారెంట్లకు ప్రస్తుతం ఈ స్టవ్‌ బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్‌ కష్టాలనుంచి బయటపడేస్తుంది. మొత్తంగా చూసుకుంటే సాధారణ నీటిని ఇంధనంగా మార్చి వంట చేయడం అనే విప్లవాత్మకమైన మార్పు అందుబాటులోకి వస్తే గ్యాస్‌ కష్టాలు తీరిపోయినట్టే. పూర్వం కట్టెల కష్టాలను గ్యాస్‌ తీర్చినట్టుగా...ఇప్పుడు గ్యాస్‌ కష్టాలను నీరు తీరుస్తుంది.

Tags:    

Similar News