Uric Acid Control: యూరిక్ యాసిడ్ ముప్పు తప్పించుకోవాలా? అయితే ఇది తినాల్సిందే!

Uric Acid Control: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో వాల్‌నట్స్ (Walnuts) కీలక పాత్ర పోషిస్తాయి.

Update: 2026-04-10 09:26 GMT

Uric Acid Control: నేటి కాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పుల వల్ల చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, మూత్రపిండాలు వాటిని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా ఇది కీళ్లలో స్ఫటికాల (Crystals) రూపంలో పేరుకుపోయి.. పాదాల వాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా వాల్‌నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు:

వాల్‌నట్స్ కేవలం మెదడు పనితీరుకే కాదు, యూరిక్ యాసిడ్ నియంత్రణకు కూడా మేలు చేస్తాయి. వీటిలో:

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఖనిజాలు: రాగి (Copper), ఫాస్పరస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.

విటమిన్లు: విటమిన్ B6 మరియు ఆరోగ్యకరమైన ప్రొటీన్లు లభిస్తాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: ఇవి కీళ్లలో ఉండే వాపును, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

ఎలా తీసుకోవాలి?

యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడాలంటే రోజుకు 3 నుంచి 4 మీడియం సైజ్ వాల్‌నట్స్ తీసుకోవడం సరిపోతుంది. వీటిని తీసుకోవడానికి కొన్ని ఉత్తమ మార్గాలు.. రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. వీటిని మామూలుగా లేదా సలాడ్లు, స్మూతీలు, షేక్లలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.

Tags:    

Similar News