Nizamabad: ఈరోజు కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవం.. తరలిరానున్న ఆర్ఎస్ఎస్ శ్రేణులు
Nizamabad: ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవర్ జన్మస్థలం కందకుర్తిలో రూ. 30 కోట్లతో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు.
Nizamabad: రేపే కేశవ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవం.. తరలిరానున్న ఆర్ఎస్ఎస్ శ్రేణులు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని నిర్మించింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సన్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవర్ పూర్వీకుల సొంత గ్రామమైన కందకుర్తిలో రూ. 30 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలఖ్ డాక్టర్ మోహన్ రావ్ భగవత్ శనివారం ప్రారంభించనున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఆ సమయంలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ఛాయా చిత్రాలను గోడలపై ఏర్పాటు చేశారు. హెగ్డేవార్ పూర్వీకుల ఇంటిని స్వయం సేవకులు 1993లో స్మృతి మందిరంగా మార్చి కేశవ శిశు మందిరం పేరిట పాఠశాల నిర్వహించారు. గతఏడాది దాని తొలగించి స్ఫూర్తి మందిర నిర్మాణ పనులు ప్రారంభించారు. కందకుర్తిలో డాక్టర్ మోహన్ రావు భగవత్ శనివారం సాయంత్రం మందిరాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు. 10 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో పాటు కేంద్ర రాష్ట్ర పారా మిలట్రీ బలగాలను సైతం కందకుర్తి లో దింపారు.