Wanaparthy: విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి.. జిల్లా కలెక్టర్

Wanaparthy: వనపర్తి జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు.

Update: 2026-04-10 08:50 GMT

Wanaparthy: విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి.. జిల్లా కలెక్టర్

Wanaparthy: జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడ భవనంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఇటీవల గ్రంథాలయ భవనంలో చేపట్టిన మొదటి అంతస్తు నిర్మాణ పనులు మరియు మరమ్మత్తు పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. త్వరలోనే నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్, గ్రంథాలయానికి చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను సరైన రీతిలో వినియోగించుకునేలా సంబంధిత అధికారులను సూచించారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ కేంద్రం సందర్శన

వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో అందించిన సిటీ స్కాన్ యంత్రాన్ని పరిశీలించారు. రోగులకు సిటీ స్కాన్ యంత్రం ద్వారా మెరుగైన సేవలను అందించాలని, స్కానింగ్ అనంతరం రోగులకు నివేదికలను సమయానికి అందించాలని వైద్యులను ఆదేశించారు.

త్వరలోనే సిటీ స్కాన్ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు తేదీ ఖరారు చేయడం జరుగుతుందని అందుకు తగ్గట్టు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిజిహెచ్ సూపర్డెంట్ అరుణ కుమారి ఆర్ఎంవో రెడ్డి కుమారి, ఇతర వైద్యులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Tags:    

Similar News