Armoor: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

Armoor: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు.

Update: 2026-04-10 09:55 GMT

Armoor: అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ

Armoor: జిల్లా కేంద్ర అంకాపూర్ గ్రామంలో అంగన్వాడి ఉపాధ్యాయులకు సెల్ ఫోన్ లను పంపిణీ చేసిన నియోజవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లను ఉద్దేశించి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్ లను అంగన్వాడీ టీచర్ సద్వినియోగపర్చుకోవాలన్నారు అంగన్వాడిలా నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలో పొందుపరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.

అంగన్వాడి నిర్వాహకులు పిల్లలకు, గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నియోజకవర్గంలోని మొత్తం 326 సెల్ఫోన్లను అంగన్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్ స్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఇంకా ఏ విషయం, సమస్యలను ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూస్తానని అంగన్వాడి టీచర్లకు,హామీ ఇవ్వడం జరిగింది.

Tags:    

Similar News