Siddipet: దుబ్బాక పల్లె దవాఖానకు శాపం.. మురికి నీటిలోనే నూతన భవనం!

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని 14వ వార్డులో పల్లె దవాఖాన భవనం మురికి గుంటగా మారింది. డ్రైనేజీ నీరు భవనాన్ని చుట్టుముట్టడంతో ప్రారంభానికి ముందే అధ్వానంగా తయారైంది.

Update: 2026-04-11 07:15 GMT

Siddipet: దుబ్బాక పల్లె దవాఖానకు శాపం.. మురికి నీటిలోనే నూతన భవనం!

Siddipet: పల్లే దవఖాన ప్రారంభానికి మోక్షం ఎప్పుడో అధికారుల అలసత్వమా పాలకుల నిర్లక్ష్యమా తెలియదు కానీ పేరుకు మాత్రం పల్లె దావకానగా నూతన భవనాన్ని నిర్మించారు కానీ ప్రారంభించలేదు భవనం మాత్రం డ్రైనేజీలో కూరుకుపోయి దుర్గంధం . వెదజల్లుతుంది ఆ ప్రాంతమంతా సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ని 14 వార్డులోని మాలకుంట సమీపంలో పల్లె దావఖాన నూతన భవనాన్ని నిర్మించారు ఇంతవరకు ప్రారంభించలేదు అంతేకాకుండా వార్డులో నుంచి వచ్చే మురికి నీరంతా ఆ నూతన భవనం చుట్టూ చేరిపోవడంతో భవనం పూర్తిగా మురికి కూపలో మునిగిపోయింది మరి ఇటువైపు అధికారులు చూడడం లేదా మరి నాయకులు రావడం లేదా తెలియదు కానీ ఆ ప్రాంతమంతా పూర్తిగా డ్రైనేజీలోని భవనం ఉంది డ్రైనేజీ నీటితో నూతన భవనం నీటిలోనే కనిపిస్తోంది.

చిన్న కుంటల తలపిస్తోంది పల్లె దావకాన వెనక భాగంలో పశువుల దావకాన నిత్యము పశువుల దావకానికి పశువులకు తీసుకుని వస్తూ ఉంటారు. అక్కడికి రావాలంటేనే జనాలు ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఇక్కడ జరిగింది.

Tags:    

Similar News