Lepakshi: బెంగళూరు వాసి హత్య కేసును ఛేదించిన లేపాక్షి పోలీసులు
Lepakshi: లేపాక్షి మండలం మానేపల్లి వద్ద జరిగిన వినయ్ కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Lepakshi: బెంగళూరు వాసి హత్య కేసును ఛేదించిన లేపాక్షి పోలీసులు
Lepakshi: శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం లో మానేపల్లి సమీపన ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును చేదించిన లేపాక్షి పోలీసులు. రాజు, శ్రేయస్, వేణుగోపాల్ అని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యకు కుటుంబ విభేదాలే కారణమని సీఐ జనార్దన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. లేపాక్షి మండలం మానేపల్లి గ్రామం వద్ద జరిగిన బెంగళూరుకు చెందిన వినయ్ కుమార్ హత్య కేసు జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు వినయ్ కుమార్‌కు, నిందితులకు మధ్య గత కొంతకాలంగా కుటుంబ పరమైన విభేదాలు ఉన్నాయి. ఈ గొడవలే క్రమంగా పగగా మారాయి. ఎలాగైనా వినయ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న నిందితులు, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 4వ తేదీన వినయ్ కుమార్ ను బెంగళూరు నుంచి అతని బామ్మర్ది రాజు కారు తీయిస్తానంటూ వెంకటాపురం గ్రామానికి పిలిపించారు.
గ్రామ సమీపంలోని అందరినీవా కాలువ వద్దకు వినయ్ కుమార్ ను తీసుకు వెళ్లి క్రికెట్ బ్యాట్ తో వినయ్ పై రాజు, శ్రేయస్, వేణుగోపాల్ అనే ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి హత్య చేశారు. ఆనవాళ్లు బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరినీ ఒక కాలువలో వినయ్ మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని పడేవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వినయ్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న లేపాక్షి పోలీసులు హత్యకు పాల్పడిన ముగ్గురునీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి ఒక కారు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ తెలిపారు.