Visakhapatnam: బాటసారుల కోసం కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ చొరవ
Visakhapatnam: విశాఖపట్నం మాధవధారలో కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.
Visakhapatnam: బాటసారుల కోసం కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ చొరవ
Visakhapatnam: ప్రముఖ సంఘ సేవకులు కీర్తిశేషులు సనపల సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు సనపల శ్రీకాంత్ ఆర్థిక సహాయంతో కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మాధవ యువజన సమాజం ఆవరణలో చలివేంద్రాన్ని ఆదివారం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి,
50వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సనపల వరప్రసాద్, బిజెపి విశాఖ జిల్లా మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ బగాది శ్యామల మూర్తి, 51 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సనపల కీర్తి, శ్రీ మాధవ యువజన సమాజం కన్వీనర్ సనపల రామ్ గోపాల్ రావు, స్టీల్ ప్లాంట్ సిఐటియు నాయకులు మరియు శ్రీ మాధవ యువజన సమాజం మాజీ అధ్యక్షులు కూన వెంకటరావు, ప్రముఖ న్యాయవాది సనపల నాగచంద్రుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పేడాడ రమణికుమారి మాట్లాడుతూ మాధవధార కళింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. వాహనదారులకు బాటసారులకు వేసవి తాపానికి గురికాకుండా ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సాలువ మెమొంటోళ్ళతో ఘనంగా సత్కరించారు. మాధవదార కలింగ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సనపల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు సనపల నరేందర్, అధ్యక్షులు నంబాల ఈశ్వరరావు అసోసియేషన్ సభ్యులు,మాధవధార గ్రామ ప్రజలు పాల్గొన్నారు.