Nellore: మరణించినా మరువలేని త్యాగం.. సుధాకర్ ఔదార్యం

Nellore: నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన సుధాకర్ అవయవదానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది.

Update: 2026-04-12 14:40 GMT

Nellore: మరణించినా మరువలేని త్యాగం.. సుధాకర్ ఔదార్యం

Nellore: నెల్లూరు జిల్లాలో మానవత్వం పరిమళించింది. మరణం అంచున ఉండి కూడా మరో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించి అమరత్వానికి నిలువుటద్దంగా నిలిచారు పుచ్చకట్ల సుధాకర్. మర్రిపాడు మండలం ఉమ్మయపల్లె గ్రామానికి చెందిన రమణయ్య కుమారుడు సుధాకర్, ఈ నెల 10వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.

పరిస్థితి విషమించడంతో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ బృందం చేసిన పరీక్షల్లో సుధాకర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారణ అయ్యింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య మరియు కుటుంబ సభ్యులకు వైద్యులు అవయవదానం ప్రాముఖ్యతను వివరించగా, వారు ఎంతో ఉదాత్తంగా స్పందించి సుధాకర్ అవయవాలను దానం చేసేందుకు హృదయపూర్వక అంగీకారం తెలిపారు.

జీవనదాన్ ప్రోటోకాల్ ప్రకారం సుధాకర్ యొక్క ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి, మరొక కిడ్నీని నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి, మరియు ఆయన గుండెను తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్‌కు కేటాయించారు.

ఈ సందర్భంగా సుధాకర్ కుమారుడు మాట్లాడుతూ..

"మా తండ్రి భౌతికంగా లేకపోయినా, ఆయన అవయవాలు మరొక కుటుంబానికి వెలుగునిస్తే అదే మాకు శాశ్వత సంతృప్తి" అని చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస రాజు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, డాక్టర్ సన్నెస్ రెడ్డి, డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ జగదీప్,

డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ శేషయ్య, డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి, డాక్టర్ సతీష్ కుమార్ మరియు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారలు సుధాకర్ కుటుంబ సభ్యుల సహృదయాన్ని ఘనంగా అభినందించారు. మరణించిన తర్వాత కూడా పలువురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సుధాకర్ త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకం.

నెల్లూరు కిమ్స్ ఆసుపత్రిలో అవయవదానం.. బ్రెయిన్ డెడ్ అయిన సుధాకర్ అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ.. ఉమ్మాయపల్లె గ్రామానికి చెందిన సుధాకర్ కుటుంబ సభ్యుల ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు.. తిరుపతి స్విమ్స్, కిమ్స్ మరియు పద్మావతి హార్ట్ సెంటర్‌లకు అవయవాల కేటాయింపు.. "మా నాన్న వేరొకరిలో జీవించి ఉండటం మాకు గర్వకారణం" అని కన్నీటి పర్యంతమైన సుధాకర్ కుమారుడు.

Tags:    

Similar News