Khajipeta: కీర్తన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి

Khajipeta: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు.

Update: 2026-04-12 13:22 GMT

Khajipeta: కీర్తన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి

Khajipeta: వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలో హత్యకు గురైన కీర్తన కుటుంబాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పరామర్శించారు. కీర్తన తల్లిదండ్రులకు ప్రభుత్వం న్యాయం చేయాలనీ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆడపిల్లలపై దాడులు ఎక్కువ అయ్యాయనీ, మహిళలు ఆడబిడ్డలపై దాడులు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రంలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయనీ, పాఠశాలలలో మెరుగైన విద్య తో పాటు మెరుగైన బుద్ధులను కూడా విద్యార్థులకు నేర్పించాలనీ ఎంపీ అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నాయనీ, గంజాయి అమ్మకాలు , బెల్ట్ షాపులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలనీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News