MI vs KKR: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే!

MI vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్ది సేపట్లో మాజీ ఛాంపియన్‌లు ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

Update: 2026-03-29 13:52 GMT

MI vs KKR: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే!

MI vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్ది సేపట్లో మాజీ ఛాంపియన్‌లు ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. పిచ్ బాగుందని, గతంలో కంటే పచ్చగా కనిపిస్తోందని హార్దిక్ చెప్పాడు. వాంఖడే తమకు కంచుకోట అని, ప్రేక్షకులు మద్దతుగా తమకు ఉందన్నాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని చూశామని, వాంఖడేలో ఇంత పచ్చికను ఎప్పుడూ చూడలేదని రహానె చెప్పుకొచ్చాడు. ముంబై ఒక ఛాంపియన్ జట్టు అని, అయినా మేము గెలుస్తామని జింక్స్ ధీమా వ్యక్తం చేశాడు.

హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని ముంబై అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. టీమిండియా స్టార్లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్, దీపక్‌ చాహర్, శాంట్నర్‌లతో బలంగా ఉంది. ఐపీఎల్‌ 2026 వేలంలో కొత్త క్రికెటర్లను తీసుకున్న కోల్‌కతా అజింక్య రహానె నాయకత్వంలో బరిలోకి దిగనుంది. అయితే కోల్‌కతాకు బౌలింగ్‌ పెద్ద సమస్యగా మారింది. ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు వదిలేయగా.. హర్షిత్‌ రాణా, ఆకాశ్‌దీప్‌ గాయాలతో దూరం కావడంతో బౌలింగ్‌ బలహీనపడింది. పేసర్‌ మహీశ పతిరన తొలి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దాంతో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, పేసర్ ముజారబానీపై పూర్తి భారం పడనుంది. ఫిన్ అలెన్, రహానె, కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్ బ్యాటింగ్‌లో ఉన్నారు.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఏఎం ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానె (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ.

Tags:    

Similar News