Ishan Kishan: ఇషాన్ కిషన్‌ అరుదైన రికార్డు.. మొదటి భారత ఆటగాడిగా చరిత్ర!

Ishan Kishan Creates History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభం అయింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ మొదలయింది.

Update: 2026-03-28 13:41 GMT

Ishan Kishan Creates History: Youngest Indian Captain for SRH in IPL 2026

Ishan Kishan Creates History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభం అయింది. ఎం చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ మొదలయింది. ఎస్ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుతో చేరినప్పటికీ.. ఫిట్‌నెస్‌ కారణాల వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. ఈ బాధ్యత చేపట్టడం ద్వారా ఇషాన్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చరిత్రలో అతిపిన్న వయసులో సారథ్యం చేపట్టిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. 27 ఏళ్ల 253 రోజులకు అతడు జట్టు పగ్గాలు అందుకున్నాడు. గతంలో భారత్ ప్లేయర్స్ భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, మనీశ్ పాండే వంటి వారు కెప్టెన్లుగా చేసినా.. వారందరి కంటే ఇషాన్ వయసులో చిన్నవాడు. ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్ల జాబితాలో ఇషాన్ రెండో స్థానంలో నిలిచాడు. 2018లో కేన్ విలియమ్సన్ 27 ఏళ్ల 244 రోజుల వయసులో కెప్టెన్సీ చేపట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇషాన్ సారథ్యంలో ఎస్ఆర్‌హెచ్ ఎలా ఆడుతుందో చూడాలి. గత రెండేళ్ల నుంచి ఎస్ఆర్‌హెచ్ తరఫున ఇషాన్ ఆడుతున్న విషయం తెలిసిందే. జార్ఖండ్ జట్టుకు కెప్టెన్సీ చేసిన అనుభవం అతడికి ఉంది.

ఇషాన్ కిషన్ ఎంపికపై ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ సానుకూలంగా స్పందించారు. ఇషాన్ గత అనుభవం జట్టుకు ప్లస్ అవుతుందని పేర్కొన్నారు. 'ఇషాన్ కిషన్‌కు ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. అండర్-19 జట్టును, ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన జట్టును విజేతగా నిలిపాడు. మైదానంలో అతను జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడని మాకు నమ్మకం ఉంది. అలాగే ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మధ్య ఉన్న మంచి స్నేహం మైదానంలో మెరుగైన భాగస్వామ్యానికి దారితీస్తుంది. వీరిద్దరూ జట్టుకు బలమైన పునాది వేస్తారు' అని వెటోరీ ఆశాభావం వ్యక్తం చేశారు

Tags:    

Similar News