Hardik Pandya: అది కదా హార్దిక్ పాండ్యా అంటే.. గ్రౌండ్ స్టాఫ్ కి గిఫ్ట్స్!
Hardik Pandya: హార్దిక్ పాండ్య ముంబయి వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కు గిఫ్ట్స్ ఇచ్చాడు. తనకు ప్రాక్టీస్ లో సహాయం చేసినందుకు ఈ గిఫ్ట్స్ ఇచ్చినట్టు తెలిసింది.
Hardik Pandya
Hardik Pandya: హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టులో టాప్ ఆల్-రౌండర్ . గ్రౌండ్ లో తన బ్యాటింగ్ దూకుడుతో.. ప్రమాదకరమైన బౌలింగ్ తో ప్రత్యర్ధులు చుక్కలు చూపిస్తాడు. గ్రౌండ్ బయట కూడా అదే దూకుడుతో డబ్బు ఖర్చు చేసేస్తాడు. క్రికెట్ ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడంలో హార్దిక్ పాండ్యా పేరు మోగుతుంటుంది. ఖరీదైన వాచీలు లగ్జరీ కార్లతో హార్దిక్ పాండ్యా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాడు. అయితే, ఈసారి హార్దిక్ పాండ్యా ఒక ప్రత్యేక కారణంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన ఒక పనికి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు .
హార్దిక్ పాండ్యా ఏం చేశాడు?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వాంఖడే స్టేడియం సిబ్బందికి లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. భారత జట్టు కోసం పూర్తిస్థాయిలో రాణించడానికైనా, లేదా ఎవరికైనా ఇచ్చిన మాటకైనా, అతను ఎప్పుడూ వెనక్కి తగ్గడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో పనిచేస్తున్న 11 మంది గ్రౌండ్స్‌కీపర్‌లకు హార్దిక్ ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. హార్దిక్ 2026 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నప్పుడు, ఈ గ్రౌండ్స్‌కీపర్లు అతనికి ఎంతో సహాయం చేశారు. అందుకోసమే ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
వైరల్ అవుతున్న ఫోటో:
నేషనల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, 2026 టీ20 ప్రపంచ కప్ కోసం సిద్ధమయ్యేందుకు హార్దిక్ వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ట్రైనింగ్ తీసుకునేవాడు. దీంతో గ్రౌండ్ సిబ్బంది చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఈ విధంగా గ్రౌండ్ సిబ్బంది హార్దిక్‌కు అతని శిక్షణలో తమ వంతు సహాయం అందించారు. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచి తిరిగి వచ్చాక అందరికీ మంచి గిఫ్ట్ ఇస్తానని హార్దిక్ పాండ్యా మాట ఇచ్చాడు. ఇప్పుడు హార్దిక్ ఆ మాట నిలబెట్టుకున్నాడు. అతను సభ్యులందరికీ చెక్కులు అందజేసి, వారితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై ఆరోసారి ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుస్తుందా?
ఐపీఎల్ 2026లో, హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు, మార్చి 29, 2026న వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఆడనున్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ప్రదర్శన నిరాశపరిచింది. ఈసారి, తమ ఆరో ట్రోఫీని గెలుచుకోవడానికి హార్దిక్, రోహిత్ శర్మ ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని హామీ ఇచ్చారు. ఐపీఎల్ చరిత్రలో చెరో 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న జట్లు రెండు మాత్రమే. అవి ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, రెండు ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో టైటిళ్లను గెలుచుకుంది.