India Schedule 2026-27: భారత్ 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌ మ్యాచ్‌ల డీటెయిల్స్ ఇవే!

India Schedule 2026-27: టీమిండియా 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్‌లో నాలుగు దేశాలు (వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా) భారత్ పర్యటనకు రానుండగా.. మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు 17 నగరాల్లో జరగనున్నాయి.

Update: 2026-03-26 11:34 GMT

India Schedule 2026-27:టీమిండియా 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్‌లో నాలుగు దేశాలు (వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా) భారత్ పర్యటనకు రానుండగా.. మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు 17 నగరాల్లో జరగనున్నాయి. 2026 సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌ పర్యటనతో మొదలయ్యే ఈ హోమ్ సీజన్‌.. 2027 మార్చి 3తో ముగుస్తుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో ఒక వన్డే, ఒక టీ20 మ్యాచ్‌ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లతో దేశవ్యాప్తంగా అభిమానులకు ప్రత్యక్షంగా క్రికెట్ ఆస్వాదించే అవకాశం లభించనుంది.

భారత్ vs వెస్టిండీస్‌:

2026-27 హోమ్ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌ పర్యటనతో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. వన్డేలు త్రివేండ్రం, గువాహటి, న్యూ చండీగఢ్ నగరాల్లో జరుగుతాయి. అనంతరం టీ20 మ్యాచ్‌లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్ (అక్టోబర్ 14), బెంగళూరులో జరగనున్నాయి.

భారత్ vs శ్రీలంక:

డిసెంబర్ 2026లో శ్రీలంక టీమ్ భారత్ పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. వన్డే మ్యాచ్‌లు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు రాజ్‌కోట్, కటక్, పుణే నగరాల్లో జరగనున్నాయి.

భారత్ vs జింబాబ్వే:

2027 జనవరిలో భారత్‌కు జింబాబ్వే రానుంది. ఇరు జట్లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లు కోల్‌కతా, హైదరాబాద్ (జనవరి 6), ముంబై నగరాల్లో జరగనున్నాయి.

భారత్ vs ఆస్ట్రేలియా:

ఈ సీజన్‌లో హైలైట్‌గా నిలిచే సిరీస్ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ. 2027 జనవరి 21న నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆ తరువాత చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ నగరాల్లో మిగతా నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ క్రికెట్‌లో అగ్ర జట్ల మధ్య జరిగే ఈ పోరు అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తంగా భారత్ 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ క్రికెట్ అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుంది. వన్డేలు, టీ20లు, టెస్టులు.. అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఉండటంతో ఈ సీజన్ క్రికెట్ పండుగలా మారనుంది.

Tags:    

Similar News