CSK IPL Journey: ఐదు టైటిల్స్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్.. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే ప్రయాణం ఇదే!

CSK IPL Journey: 2008లో ప్రారంభమైన ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు సీఎస్‌కే అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఇప్పటికే చెన్నై ఐదు టైటిల్స్ గెలిచి.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోంది.

Update: 2026-03-25 14:43 GMT

CSK IPL Journey

CSK IPL Journey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఒకటి. స్థిరత్వం, అనుభవం, ఒత్తిడిలోనూ గెలిచే సామర్థ్యం సీఎస్‌కే ప్రత్యేకత. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ నుంచి ఇప్పటివరకు ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తూ వచ్చింది. ఇప్పటికే చెన్నై ఐదు టైటిల్స్ గెలిచి.. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే ప్రయాణం ఎలా ఉందో ఓసారి చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ మొదటి సీజన్ 2008లోనే ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2009లో సీఎస్‌కే సెమీ ఫైనల్ వరకు చేరింది. ఆ తర్వాత 2010, 2011లో వరుసగా టైటిల్స్ గెలుచుకుని.. తన ఆధిపత్యాన్ని చాటింది. 2012, 2013, 2015, 2019లో ఫైనల్స్‌కి చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లో మూడో స్థానంలో నిలిచిన సీఎస్‌కే.. 2018లో మరోసారి టైటిల్ గెలవడంతో జట్టు బలం మరోసారి నిరూపితమైంది.

2020 తర్వాత సీఎస్‌కే ప్రదర్శన కాస్త తగ్గింది. 2020లో 7వ స్థానం, 2022లో 9వ స్థానం, 2025లో 10వ స్థానంతో అభిమానులను నిరాశపరిచింది. అయితే 2021, 2023లో టైటిల్స్ గెలుచుకుని తమ క్లాస్‌ను మరోసారి నిరూపించింది. ఈ గణాంకాలు చూస్తే సీఎస్‌కే ఎప్పుడైనా తిరిగి బలంగా రాణించే జట్టని అర్థమవుతుంది.

ఐపీఎల్ 2026లో సీఎస్‌కే ప్రదర్శనపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గత సీజన్‌లో నిరాశపరిచినా.. సీఎస్‌కే రీబిల్డ్ దశలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఆటగాళ్లను జట్టులోకి ఉండడం, అనుభవజ్ఞుల మార్గదర్శనం కలిస్తే.. సీఎస్‌కే మళ్లీ టాప్ 4లోకి రావడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. 2026 సీజన్‌లో చెన్నై కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభిమానులు మరోసారి ట్రోఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంఎస్ ధోనీకే ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టైటిల్ గెలిచి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఫాన్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News