IPL 2026: గిల్ vs కోహ్లీ vs రాహుల్.. ముగ్గురిలో 'ధురంధర్' ఎవరు?, ఊహించలేరు!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా టీమిండియా బ్యాటర్స్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తున్నారు. వీరు ప్రతి ఏడాది పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా 2021 నుంచి 2025 వరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.
IPL 2026: గిల్ vs కోహ్లీ vs రాహుల్.. ముగ్గురిలో 'ధురంధర్' ఎవరు?, ఊహించలేరు!
IPL 2026:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా టీమిండియా బ్యాటర్స్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తున్నారు. వీరు ప్రతి ఏడాది పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా 2021 నుంచి 2025 వరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరి గణాంకాలు చూస్తే.. ఎవరు ఎంత ప్రభావం చూపారో స్పష్టంగా తెలుస్తోంది. గిల్ vs కోహ్లీ vs రాహుల్ మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముగ్గురిలో 'ధురంధర్' ఎవరో ఇప్పుడు చూద్దాం.
శుభ్‌మన్ గిల్:
2021 నుంచి 2025 మధ్య శుభ్‌మన్ గిల్ 77 ఇన్నింగ్స్‌లలో 2927 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతని సగటు 43.04 కాగా.. స్ట్రైక్ రేట్ 143.04గా ఉంది. ఈ ఐదేళ్లలో గిల్ 4 సెంచరీలు, 19 అర్ధశతకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ ఈ ముగ్గురిలో కంటే అత్యధికం కావడం విశేషం. దాంతో గిల్ ధురంధర్ అని చెప్పొచ్చు. గిల్ ఇప్పుడు జీటీకి ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లీ:
విరాట్ కోహ్లీ 73 ఇన్నింగ్స్‌లలో 2783 పరుగులు చేశాడు. కింగ్ సగటు 46.38గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 139.60గా ఉంది. 2021 నుంచి 2025 మధ్య కోహ్లీ 3 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు నమోదు చేసి కన్సిస్టెన్సీ పరంగా తన స్థాయి చూపించాడు. ముఖ్యంగా అర్ధశతకాల సంఖ్య ఎక్కువగా ఉండటం అతని నిలకడను సూచిస్తోంది. ఎన్నో ఏళ్లుగా విరాట్ ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్:
కేఎల్ రాహుల్ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. 2021 నుంచి 2025 మధ్య 64 ఇన్నింగ్స్‌లలో 2575 పరుగులు బాదాడు. రాహుల్ సగటు 47.69తో ఈ ముగ్గురిలో టాప్‌లో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 135.54 కాగా.. 3 సెంచరీలు, 19 ఫిఫ్టీలు నమోదు చేశాడు. రాహుల్ ఎక్కువగా యాంకర్ పాత్రలో ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందిస్తున్నాడు.
మొత్తంగా చూస్తే:
శుభ్‌మన్ గిల్ అగ్రెసివ్ బ్యాటింగ్‌లో ముందుండగా, విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీలో మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ సగటు పరంగా టాప్‌లో ఉండి యాంకర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తమ స్టైల్‌లో జట్లకు కీలకంగా మారినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.