Armoor: ఆర్మూర్ క్రికెటర్ల మెరుపులు.. ఫైనల్‌లో 3 వికెట్ల తేడాతో విజయం

Armoor: నిజామాబాద్‌లో జరిగిన కోర్స్ డిఎన్ఏ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆర్మూర్ క్రికెట్ అకాడమీ ఛాంపియన్‌గా నిలిచింది.

Update: 2026-03-23 11:59 GMT

Armoor: ఆర్మూర్ క్రికెటర్ల మెరుపులు.. ఫైనల్‌లో 3 వికెట్ల తేడాతో విజయం

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నవ్య భారతి గ్లోబల్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కోర్స్ డిఎన్ఏ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు నిలిచింది. గత మూడు రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం రోజు ముగిసింది. ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో నిజామాబాద్ జట్టుతో ఆర్మూర్ జట్టు పోటీ పడగా నిర్ణీత 20 ఓవర్ల మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఛాంపియన్స్ క్రికెట్ అకాడమీ నిజామాబాద్ జట్టు 141 పరులకు ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టు 17.5 ఓవర్లలో 142 పరుగులు మూడు వికెట్లు కోల్పోయి ఛాంపియన్గా నిలిచింది.

ఆర్మూర్ క్రికెట్ అకాడమీ జట్టులో ఓపెనర్గా వచ్చిన శశున్ 55 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. గణేష్ సింగ్ మిడిల్ ఆర్డర్ లో వచ్చి 25బంతుల్లో 1సిక్స్ 3ఫోర్ లతో 30 పరుగులు చేశాడు, వివన్ రెడ్డి 13 బంతుల్లో ఆరు ఫోర్లతో విరుచుకుబడి 26 పరుగులు చేసి విజయాన్ని సునాయాసం చేసి విజయ తీరాలకు తీసుకెళ్లాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంజీ ట్రోఫీ క్రికెటర్ అంకిత్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ , బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఫీల్డర్ గా విజ్ఞాన్ ఎంపికయ్యారు.

కెప్టెన్ విజ్ఞాన్ కు విన్నింగ్ ట్రోఫీ అందజేసిన రంజీ ట్రోఫీ క్రికెటర్ అంకిత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెటర్లకు మంచి సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ఆర్మూర్ క్రికెట్ అకాడమీ కోచ్ రతన్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News