Shoaib Akhtar: ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ జుజుబి, త్వరలో దుకాణం సర్దుకోవాల్సిందే.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
Shoaib Akhtar: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) భవిష్యత్తుపై మాజీ పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలో పీఎస్ఎల్ లీగ్ దుకాణం సర్దుకోవాల్సిందే అని పరోక్షంగా అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ వాల్యూ రోజురోజుకు పెరుగుతోందన్నాడు. ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ నిలవలేకపోతోందని పేర్కొన్నాడు.
Shoaib Akhtar: ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ జుజుబి, త్వరలో దుకాణం సర్దుకోవాల్సిందే.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
Shoaib Akhtar: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) భవిష్యత్తుపై మాజీ పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలో పీఎస్ఎల్ లీగ్ దుకాణం సర్దుకోవాల్సిందే అని పరోక్షంగా అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ వాల్యూ రోజురోజుకు పెరుగుతోందన్నాడు. ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ నిలవలేకపోతోందని పేర్కొన్నాడు. విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ను వదిలి ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అక్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 కోసం ఇప్పటికే కొందరు ప్లేయర్స్ పీఎస్ఎల్ నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ లిస్టులో శ్రీలంక స్టార్ ఆటగాడు దసున్ షనక కూడా చేరాడు. పీఎస్ఎల్ 2026లో కాకుండా.. ఐపీఎల్ 2026లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. పీఎస్ఎల్ 2026 వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టు షనకను 2.2 కోట్లకు దక్కించుకుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే శనక లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ క్రేజ్ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ ప్లేయర్స్ ఇతర టీ20 లీగ్‌లను వదిలి.. భారత టీ20 టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పీఎస్ఎల్‌పై ఆవేదన వ్యక్తం చేశాడు.
షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'ఇప్పుడు చాలా మంది ఆటగాళ్లు పీఎస్ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో చేరుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పీఎస్ఎల్ ఎంతకాలం నిలబడుతుందో అనుమానం ఉంది. ఇలానే కొనసాగితే పీఎస్ఎల్ త్వరలోనే మూతపడే పరిస్థితి వస్తుంది. ప్రేక్షకులు కూడా స్థానిక ఆటగాళ్ల ఆటను చూడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మా దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ లేరు. అదే పీఎస్ఎల్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆటగాళ్లకు భారీగా దక్కుతుంది. అందుకే విదేశీ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు' అని చెప్పాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. భారీ పారితోషికాలు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, గ్లోబల్ వ్యాప్తి కారణంగా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల ఇతర టీ20 లీగ్‌లపై ప్రభావం పడుతోంది. మొత్తానికి షోయబ్ అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పీఎస్ఎల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.