IPL 2026-KKR: ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. కీలక ఆటగాళ్లు అవుట్, ఫామ్ లేమి, ఈసారి కష్టమేనా?
2026 ఐపీఎల్ ప్రారంభానికి ముందే మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇది జట్టు కూర్పుపై పెను ప్రభావం చూపనుంది.
IPL 2026-KKR: ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్‌కు వరుస షాక్‌లు.. కీలక ఆటగాళ్లు అవుట్, ఫామ్ లేమి, ఈసారి కష్టమేనా?
IPL 2026-KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సమయం ఆసన్నమైంది. మార్చి 28 నుంచి మెగా లీగ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ తలపడనున్నాయి. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొన్నానునాయి. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. ఇది జట్టు కూర్పుపై పెను ప్రభావం చూపనుంది. అంతేకాదు కీలక ఆటగాళ్ల లేమి కూడా అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరోవైపు శ్రీలంక స్పీడ్‌స్టర్ మతీశా పతిరన కూడా గాయం కారణంగా ఏప్రిల్ మధ్య వరకు అందుబాటులో ఉండడం లేదు. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ లీగ్ నుంచి తొలగించింది. కేకేఆర్ అతడిపై ఆశలు పెట్టుకుని భారీ ధరకు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇది జట్టుకు మరింత దెబ్బగా మారింది. అయితే అతడి స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరాబానిని తీసుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026లో ముజరాబాని మెరిసిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమరూన్‌ను కోల్‌కతా ఏకంగా రో.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఇపుడు గ్రీన్ ప్రదర్శనపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోల్‌కతా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక జట్టు నాయకత్వ బాధ్యతలను సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే చేపట్టనున్నట్లు సమాచారం. జింక్స్ కూడా ఇటీవలి కాలంలో పెద్దగా ఆడిన ధాఖలాలు లేవు. రింకు సింగ్ రాణిస్తున్నాడు.
ఐపీఎల్ ఆరంభ మ్యాచులలో పేస్ దాడిని ముందుండి నడిపించాల్సిన బాధ్యత వైభవ్ అరోరాపై పడనుంది. అతడికి ముజరాబాని సహకారం అందించనున్నాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి ప్రపంచస్థాయి స్పిన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. అయితే నరైన్ ఇటీవలి కాలంలో ఆడలేదు. వరుణ్ కూడా టీ20 ప్రపంచ కప్ 2026లో భారీగా రన్స్ ఇచ్చాడు. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్రలు టాప్ ఆర్డర్‌లో ఆడనున్నారు. ఈ ముగ్గురు ప్రపంచ కప్ 2026లో రన్స్ చేయడం జట్టుకు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఈ ముగ్గురితో పాటు సునీల్ నరైన్, ముజరబాని, రోవ్‌మన్ పావెల్, మతీశా పతిరన ఉన్నారు. నలుగురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎవరిని ఆడిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా ప్రస్తుతం 3-5 ఆటగాళ్లు తప్పితే కేకేఆర్ జట్టులో ఫామ్ మీదున్న ప్లేయర్స్ లేరు. కీలక ఆటగాళ్ల గాయాలు, ఫామ్ లేమి కేకేఆర్ జట్టు టైటిల్ అవకాశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో.. కేకేఆర్ ఈ సీజన్‌లో ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం జట్టు బాగా ఆడుతుందని ఆశిస్తున్నారు.