IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు.. టాప్ టీమ్స్ షాకింగ్ రికార్డులు ఇవే!
IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌గా 49 పరుగులు నమోదు కావడం విశేషం. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్‌గా నిలిచింది.
IPL 2026: ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు.. టాప్ టీమ్స్ షాకింగ్ రికార్డులు ఇవే!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం గుర్తుకొస్తాయి. బ్యాటర్లు ఇన్నింగ్స్ మొదటి నుంచే విరుచుకుపడడంతో.. 200+ స్కోర్లు ఎన్నోసార్లు నమోదయ్యాయి. హిట్టర్ల విధ్వంసం కారణంగా ఐపీఎల్‌లో 250కి పైగా స్కోర్లు సాధారణంగా మారిపోయాయి. అయితే ఇదే టోర్నీలో కొన్ని జట్లు అత్యల్ప స్కోర్లకు కుప్పకూలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ లో స్కోర్లు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా టాప్ టీమ్స్ రికార్డులు క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్‌గా 49 పరుగులు నమోదు కావడం విశేషం. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోర్‌గా నిలిచింది. 2009లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆర్సీబీపై 58 పరుగులకు కుప్పకూలింది. 2023లో కూడా రాజస్థాన్ మరోసారి 59 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో ముంబై ఇండియన్స్‌పై 66 పరుగులకే ఆలౌట్ కాగా.. కోల్‌కతా అదే ఏడాది 67 పరుగులకే పరిమితం అయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ జాబితాలో ఎక్కువసార్లు ఉండడం గమనార్హం. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 68 పరుగులు, 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 70 పరుగులు, 2014లో రాజస్థాన్‌పై కూడా 70 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ 2017లో 73 పరుగులు, కొచ్చి టస్కర్స్ కేరళ 2011లో 74 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్ 2013లో 79 పరుగులు నమోదు చేశాయి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కూడా 80కి లోపు పరిమితం అయ్యాయి.
ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఉంది. 2024 సీజన్‌లో బెంగళూరుపై ఎస్‌ఆర్‌హెచ్ 287/3 స్కోర్ చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అదే ఎస్‌ఆర్‌హెచ్ తక్కువ స్కోర్ కూడా చేసింది. ఈ గణాంకాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఐపీఎల్‌లో ఎంత పెద్ద జట్టైనా, ఎంత స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఒక రోజు దారుణ ప్రదర్శనతో కుప్పకూలే అవకాశం ఉంటుంది. అదే ఐపీఎల్ లీగ్ ప్రత్యేకత.