IPL 2026: ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ రేర్ రికార్డు.. బహుశా బుమ్రాకు కూడా సాధ్యం కాకపోవచ్చు!
IPL 2026. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. మెగా లీగ్‌లో భువీ మొత్తం 1793 డాట్ బాల్స్ వేసి టాప్‌లో కొనసాగుతున్నాడు.
IPL 2026: ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్ రేర్ రికార్డు.. బహుశా బుమ్రాకు కూడా సాధ్యం కాకపోవచ్చు!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బ్యాటర్లదే హవా ఉంటుంది. బౌండరీలు, సిక్సులతో చెలరేగుతూ పరుగుల వరద పారిస్తుంటారు. బ్యాటర్ల దుమ్మురేపే ఇన్నింగ్స్‌లతో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శన కూడా మెగా లీగ్‌లో ఎంతో కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా డాట్ బాల్స్ వేయడం ద్వారా మ్యాచ్‌పై నియంత్రణ సాదిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితా ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. మెగా లీగ్‌లో భువీ మొత్తం 1793 డాట్ బాల్స్ వేసి టాప్‌లో కొనసాగుతున్నాడు. తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టడి చేయడంలో భువీ ప్రత్యేక గుర్తింపు పొందాడు. రెండో స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ ఉన్నాడు. అతను 1694 డాట్ బాల్స్‌తో ఈ జాబితాలో నిలిచాడు. నరైన్ తన మిస్టరీ స్పిన్‌తో అనేకమంది బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మూడో స్థానంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (1623 డాట్ బాల్స్) ఉన్నాడు. యాష్ తన స్పిన్ మాయాజాలంతో మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను నియంత్రించాడు.
నాలుగో స్థానంలో టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో బుమ్రా ఇప్పటివరకు 1397 డాట్ బాల్స్ వేశాడు. ఐదో స్థానంలో పియుష్ చావ్లా (1337 డాట్ బాల్స్) నిలిచాడు. వీరు తమ బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ కాలంలో కూడా డాట్ బాల్స్ ద్వారా మ్యాచ్‌ను ప్రభావితం చేసే బౌలర్లు ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భువనేశ్వర్ కుమార్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగడం ఆయన స్థిరత్వానికి నిదర్శనం. నరైన్, అశ్విన్ కంటే రెగ్యులర్‌గా ఆడుతున్న బుమ్రాకే భువీని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏకంగా 400 డాట్ బాల్స్ అంతరం ఉంది. మరి ఈ రికార్డును బుమ్రా అధిగమిస్తాడో లేదో చూడాలి.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్:
1793 బంతులు - భువనేశ్వర్ కుమార్
1694 బంతులు - సునీల్ నరైన్
1623 బంతులు - రవిచంద్రన్ అశ్విన్
1397 బంతులు - జస్ప్రీత్ బుమ్రా
1337 బంతులు - పీయూష్ చావ్లా