MS Dhoni: ఎంఎస్ ధోనీలో మరో కోణం.. రోజూ అది పక్కాగా ఉండాల్సిందే!

MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి అభిమానులకు తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితంలో మరో ఆసక్తికరమైన కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Update: 2026-03-18 13:56 GMT

MS Dhoni: ఎంఎస్ ధోనీలో మరో కోణం.. రోజూ అది పక్కాగా ఉండాల్సిందే!

MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి అభిమానులకు తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితంలో మరో ఆసక్తికరమైన కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ధోనీ గురించి ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ధోనీ ‘షీషా మ్యాన్’ అని బిల్లింగ్స్ పేర్కొన్నాడు. ధోనీకి హుక్కా (షీషా) తాగే అలవాటు ఉందని, హుక్కా అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టమని చెప్పాడు. మహీ హోటల్ గదిలో ఎప్పుడూ హుక్కా సిద్ధంగా ఉంటుందని బిల్లింగ్స్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సామ్ బిల్లింగ్స్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీకి ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ఆయన పెద్ద అభిమాని. మాంచెస్టర్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు హోటల్‌లోనే సహచరులతో కలిసి వీక్షిస్తాడు. అంతేకాకుండా ధోనీ తన గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు. జట్టు సభ్యులు ఎప్పుడైనా వచ్చి కూర్చొని మాట్లాడుకునేలా సౌకర్యం కల్పిస్తాడు. సరదాగా గడపడానికి షీషా కూడా ఏర్పాటు చేస్తాడు. హోటల్ గదిలో ఎప్పుడూ హుక్కా సిద్ధంగా ఉంటుంది. ఆ హుక్కాను రెడీ చేసే బాధ్యతను టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ చూసుకునేవాడు' అని చెప్పాడు.

ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా గుర్తుచేశారు. ' గంటలూ ఎంఎస్ ధోనీ గది ఓపెన్‌గా ఉంటుంది. ఎవరైనా వెళ్లి కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు. కొందరు షీషా ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతారు. అదే వాళ్లకు సోషల్‌గా కలిసే మార్గం' అని హస్సీ పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచంలో ప్రముఖుడిగా ఉన్న ధోనీ.. తన విశ్రాంతి సమయాన్ని చాలా సరదాగా, స్నేహపూర్వకంగా గడుపుతాడని తెలుస్తోంది. ఓపెన్ డోర్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, సహచరులతో సరదా సంభాషణలు.. ఇవే మహీ రిలాక్స్ అవ్వడానికి మార్గాలు.

ఇక ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పూర్తి సీజన్ ఆడనున్నాడని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. అయితే ధోనీ ఏ పాత్రలో ఆడతాడన్నది జట్టు కోచింగ్ సిబ్బంది నిర్ణయిస్తారని సీఈఓ తెలిపారు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్-బ్యాటర్‌గా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎలా వినియోగించాలన్నది జట్టు వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ధోనీ చెన్నైలో తన జట్టు సహచరులతో కలిసి శిక్షణలో పాల్గొంటున్నాడు. రాంచీలో నెట్ ప్రాక్టీస్ పూర్తి చేసిన అనంతరం చెన్నైకి చేరి ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నాడు. 44 ఏళ్ల వయస్సులో కూడా ధోనీ ఎప్పుడు రిటైర్ అవుతాడన్న ప్రశ్న ప్రతి సీజన్ ముందు లేవనెత్తబడుతున్నా.. ఆయన మాత్రం మైదానంలో తన ప్రదర్శనతోనే సమాధానం ఇస్తున్నాడు.

Tags:    

Similar News