Sunrisers Hyderabad: భారత ప్రయోజనాల కంటే లీగ్ గెలవడమే ముఖ్యమా? సన్‌రైజర్స్ యజమాన్యంపై స్టార్ క్రికెటర్ ఫైర్..

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమానులైన మారన్ కుటుంబంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2026-03-17 13:05 GMT

Sunrisers Hyderabad: భారత ప్రయోజనాల కంటే లీగ్ గెలవడమే ముఖ్యమా? సన్‌రైజర్స్ యజమాన్యంపై స్టార్ క్రికెటర్ ఫైర్..

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమానులైన మారన్ కుటుంబంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్‌లో జరిగే 'ది 100' లీగ్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది.

ఇంగ్లాండ్ వేదికగా జరిగే వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, సీఈఓ కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయంపై గవాస్కర్ తన కాలమ్‌లో ఘాటైన విమర్శలు చేశారు.

సైనికుల ప్రాణాలకు ముప్పు: భారతీయ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లకు ఇచ్చే డబ్బు చివరికి భారత సైనికుల ప్రాణాలకే ముప్పుగా మారుతుందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పన్నుల ద్వారా ఆయుధాల కొనుగోలు: పాక్ ఆటగాళ్లు తమ ఆదాయంపై పాకిస్థాన్ ప్రభుత్వానికి పన్ను కడతారని, ఆ సొమ్ముతో పాక్ ఆయుధాలు కొనుగోలు చేసి సరిహద్దుల్లో భారతీయ సైనికులను, అమాయక పౌరులను బలి తీసుకుంటుందని ఆయన విశ్లేషించారు.

మారన్ కుటుంబానికి అవగాహన ఉండాలి: విదేశీ కోచ్‌లకు మన రాజకీయ భావోద్వేగాలు తెలియకపోవచ్చు, కానీ భారతీయ యజమానులైన మారన్ కుటుంబానికి ఆ అవగాహన ఉండాలి కదా అని గవాస్కర్ ప్రశ్నించారు. కేవలం ఒక లీగ్ గెలవడం కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెడతారా అని నిలదీశారు.

సోషల్ మీడియాలో 'బాయ్‌కాట్ సన్‌రైజర్స్' డిమాండ్

ఈ కొనుగోలు వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ బ్రాండ్‌ను బహిష్కరించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్ నుంచి పాక్ ఆటగాళ్లను దూరం పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం విస్మరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Full View


Tags:    

Similar News