IPL 2026 injured players: ఫ్రాంఛైజీలను వేధిస్తోన్న గాయాలు.. ఏకంగా 6గురు స్టార్ ప్లేయర్స్ ఔట్..!

IPL 2026 injured players: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే జట్లకు భారీ షాక్ తగిలింది. మొత్తం ఆరుగురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, మరో ముగ్గురు ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

Update: 2026-03-20 16:40 GMT

IPL 2026 injured players: ఫ్రాంఛైజీలను వేధిస్తోన్న గాయాలు.. ఏకంగా 6గురు స్టార్ ప్లేయర్స్ ఔట్..!

IPL 2026 injured players: మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026)కి ముందు జట్లకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరమవడం ఫ్రాంచైజీలకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే రీప్లేస్‌మెంట్ ప్లేయర్ల కోసం జట్లు వెతుకుతున్నాయి.

స్టార్క్‌కు విశ్రాంతి – ఢిల్లీకి టెన్షన్..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మిచెల్ స్టార్క్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. గత ఏడాది నుంచి నిరంతర క్రికెట్ ఆడుతున్న స్టార్క్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ సూచించింది. దీంతో ఢిల్లీ తొలి మ్యాచ్‌లలో అతని సేవలు లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ప్యాట్ కమిన్స్ గాయంతో హైదరాబాద్ జట్టులో మార్పులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పితో రికవరీలో ఉన్నాడు. దీంతో అతను ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించగా, అభిషేక్ శర్మకు ఉప కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

హేజిల్‌వుడ్ కూడా ఔట్..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న జోష్ హేజిల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను 2-3 మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే గాయం కారణంగా గతంలో కూడా కీలక టోర్నీలకు దూరమయ్యాడు.

సామ్ కరణ్ ఔట్..

రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాల్సిన సామ్ కరణ్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. మినీ ఆక్షన్‌లో ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చిన అతను ఇప్పుడు ఆడకపోవడం టీమ్‌కు భారీ షాక్ తగిలింది.

జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎలిస్ కూడా ఔట్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన జాక్ ఎడ్వర్డ్స్ కూడా కాలి గాయంతో టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన నాథన్ ఎలిస్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ కారణంగా పూర్తిగా తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే ఫాస్ట్ బౌలింగ్ బలహీనపడింది.

మొత్తంగా ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే గాయాలు జట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కీలక ప్లేయర్లు దూరమవడం వల్ల జట్లు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రీప్లేస్‌మెంట్ ప్లేయర్లు ఎలా ప్రభావం చూపిస్తారో చూడాలి.

Tags:    

Similar News