RCB Captain 2026: ఐపీఎల్ 2026కు ముందు బిగ్ ట్విస్ట్.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!

RCB Captain 2026: ఆర్‌సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటిదార్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-03-22 14:34 GMT

RCB Captain 2026: ఐపీఎల్ 2026కు ముందు బిగ్ ట్విస్ట్.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!

RCB Captain 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఆర్‌సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటిదార్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవచ్చని తెలుస్తోంది. పటిదార్ ఎందుకు దూరమవుతున్నాడో సరైన కారణం ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలు లేదా గాయ సమస్యల కారణంగా అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నో సీజన్ల పాటు ఆర్‌సీబీకి సారథ్యం వచించిన కోహ్లీ.. జట్టును విజయ పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కింగ్ అనుభవం, దూకుడు ఈ కీలక సమయంలో జట్టుకు బలంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ మళ్లీ కెప్టెన్‌గా కనిపిస్తే అది అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా మారనుంది. జట్టు కష్టసమయంలో ముందుకు వచ్చి నాయకత్వం వహించడం కోహ్లీ ప్రత్యేకతగా చెప్పాలి.

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ జట్టులో ఈ నాయకత్వ మార్పు జరిగితే.. అది టోర్నమెంట్‌కు మరింత ఉత్కంఠను తెస్తుంది. విరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్‌గా చూస్తే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. కింగ్ ఐపీఎల్ 2026లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ, మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. గతేడాది ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. దాంతో 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఈసారి కప్ కొట్టేందుకు ఆర్‌సీబీ సిద్ధంగా ఉంది.

ఆర్‌సీబీ జట్టు:

అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్, జితేశ్‌ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్య, నువాన్ తుషార, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, రసిఖ్ దార్ సలామ్ , రొమారియో షెఫర్డ్, సుయాశ్‌ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యశ్‌ దయాళ్, వెంకటేశ్‌ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేస్వాల్, మంగేశ్ యాదవ్ , జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కాన్షిక్ చౌహాన్.

Tags:    

Similar News