Mumbai Indians Captaincy: హార్దిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకో.. మళ్లీ హాట్ టాపిక్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
Mumbai Indians Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఒకటి. టోర్నీలో ముంబై ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచింది.
Mumbai Indians Captaincy: హార్దిక్ కెప్టెన్సీ నుంచి తప్పుకో.. మళ్లీ హాట్ టాపిక్‌గా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
Mumbai Indians Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఒకటి. టోర్నీలో ముంబై ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచింది. 2020లో చివరగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎంఐ కప్ గెలిచింది. బలమైన జట్టుతో ఉన్నప్పటికీ 2020 తర్వాత టైటిల్ దక్కకపోవడం, ఇటీవల సీజన్లలో మిశ్రమ ఫలితాలు రావడంతో జట్టు నాయకత్వంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ఎంఐలో చేరి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను కాదని.. హార్దిక్‌కు పగ్గాలు అప్పగించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి కెప్టెన్సీ వివాదం సద్దుమణగలేదు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 2024 సీజన్‌లో ఎంఐ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. 2025లో ప్లేఆఫ్స్ చేరినా టైటిల్ దక్కకపోవడంతో విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హార్దిక్ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ఐపీఎల్ 2026 నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, భారత్ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ముంబై యాజమాన్యం, కోచింగ్ స్టాఫ్‌తో పాటు హార్దిక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కలిసి భవిష్యత్‌కు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. జట్టులో ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విజేత కెప్టెన్లు (రోహిత్, సూర్య) ఉండి హార్దిక్ నాయకత్వంలో ఆడటం ఒక విచిత్ర పరిస్థితిగా పేర్కొన్నారు.
'సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ముంబై ఇండియన్స్ అదృష్టం మారవచ్చు. సూర్యకుమార్ టీమిండియాను 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిపాడు. అతని నాయకత్వం, ఫామ్ జట్టుకు ఉపయోగపడుతుంది. హార్దిక్ పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని సూర్యకు అవకాశం ఇవ్వాలి. హార్దిక్ స్వయంగా సూర్యతో మాట్లాడి.. నాయకత్వం వహించమని చెబితే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది' అని కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. మొత్తానికి ఐపీఎల్ 2026 ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై మరోసారి చర్చకు వచ్చాయి. జట్టులో ఉన్న స్టార్ ఆటగాళ్లు కలిసి సరైన నిర్ణయం తీసుకుంటేనే ఎంఐ మళ్లీ టైటిల్ గెలిచే దిశగా అడుగులు వేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.