PSL 2026 Trolls: పెట్రోల్ షార్టేజ్ లీగ్' అది.. పీసీబీని ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్!
PSL 2026 Trolls: 'పెట్రోల్ షార్టేజ్ లీగ్' అది.. పీసీబీని ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్!ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా, అది కూడా కేవలం రెండు వేదికలకే పరిమితం చేసి నిర్వహించనున్నట్లు పీసీబీ ప్రకటించింది. పీసీబీ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వెల్లువెత్తాయి
PSL 2026 Trolls: 'పెట్రోల్ షార్టేజ్ లీగ్' అది.. పీసీబీని ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్!
PSL 2026 Trolls: 'పెట్రోల్ షార్టేజ్ లీగ్' అది.. పీసీబీని ఎగతాళి చేసిన ఐస్‌లాండ్ క్రికెట్!మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్‌పై అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా, అది కూడా కేవలం రెండు వేదికలకే పరిమితం చేసి నిర్వహించనున్నట్లు పీసీబీ ప్రకటించింది. టోర్నీపై పాక్ ప్రభుత్వం విధించిన పరిమితుల కారణంగా ఈ మార్పులు చేయాల్సి వచ్చినట్లు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం అధికారికంగా వెల్లడించాడు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఆసియా దేశాల్లో ఇంధన కొరత నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలు అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఈ క్రమంలో పాఠశాలలు మూసివేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడం, ఈద్ సెలవులు పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఆదివారం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ఇంధన సంక్షోభం తీవ్రత దృష్ట్యా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రజల కదలికలను తగ్గించాలని సూచించినట్లు తెలిపారు. భద్రతా సంస్థలతో చర్చల అనంతరం టోర్నీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని నిర్ణయించుకున్నామని, అయితే ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈసారి పీఎస్ఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు.
పీసీబీ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐస్‌లాండ్ క్రికెట్.. పీఎస్ఎల్‌ను ఎగతాళి చేసింది. ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్’ అంటూ ఎద్దేవా చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు కొందరు నెటిజెన్లు ఈ నిర్ణయానికి ఇంధన కొరతే కాకుండా.. ఇతర రాజకీయ, సైనిక కారణాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంధన సంక్షోభం ప్రభావంతో పీఎస్ఎల్ 2026 పరిస్థితి అద్వానంగా మారింది. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరగడం, ప్రారంభోత్సవం రద్దు కావడం వంటి పరిణామాలు టోర్నీ ఉత్సాహాన్ని తగ్గించనున్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ 2026 కోసం పీఎస్ఎల్ నుంచి విదేశీ ప్లేయర్స్ తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పీఎస్ఎల్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.