IPL 2026: ఐపీఎల్ 2026 కోసం జియో అదిరిపోయే గిఫ్ట్.. ఆ రీఛార్జీపై మరో 30 రోజులు ఫ్రీ..

Jio IPL 2026 Offers: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వకముందే రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2026-03-26 12:25 GMT

IPL 2026: ఐపీఎల్ 2026 కోసం జియో అదిరిపోయే గిఫ్ట్.. ఆ రీఛార్జీపై మరో 30 రోజులు ఫ్రీ..

Jio IPL 2026 Offers: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వకముందే రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఖరీదైన రీఛార్జ్‌లు, తక్కువ కాలపరిమితితో ఇబ్బంది పడేవారి కోసం మూడు నెలల ధరతోనే నాలుగు నెలల పాటు అపరిమిత సేవలను పొందేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఉచిత ఇంటర్నెట్, వినోదంతో జియో హోమ్ సేవలు ఇప్పుడు మరింత చౌకగా మారాయి.

Jio IPL 2026 Offers: దేశీయ టెలికాం దిగ్గజం జియో తన 'జియో హోమ్' బ్రాడ్‌బ్యాండ్ సేవల కింద ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా మూడు నెలల కాలపరిమితి ఉండే ప్లాన్‌లపై అదనంగా ఒక నెల సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అంటే వినియోగదారులు మూడు నెలల డబ్బు చెల్లిస్తే, ఏకంగా 120 రోజుల పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఉచిత కాలింగ్, ఓటిటి సేవలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

2222 రూపాయల ప్లాన్ విశేషాలు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సేవలు కోరుకునే వారి కోసం జియో 2222 రూపాయల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో నెలకు 1000 జీబీ డేటాతో పాటు సెకనుకు 30 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో హాట్‌స్టార్‌తో పాటు దాదాపు 10 నుంచి 12 ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఉచితంగా పొందవచ్చు. అలాగే 800కు పైగా టీవీ ఛానెళ్లను వీక్షించే సౌకర్యం కూడా ఉంది. ఆఫర్ ప్రకారం చూస్తే, వినియోగదారునికి నెలకు కేవలం 555 రూపాయల ఖర్చుతోనే ఈ భారీ వినోద ప్యాకేజీ అందుతుంది.

3333 రూపాయల ప్రీమియం ప్లాన్..

వేగవంతమైన ఇంటర్నెట్ కోరుకునే వారి కోసం 3333 రూపాయల ప్లాన్ ఎంతో అనువుగా ఉంటుంది. ఇందులో సెకనుకు 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. దీనివల్ల ఆన్‌లైన్ గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఎంతో సాఫీగా సాగుతాయి. ఈ ప్లాన్‌తో సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం వంటి అగ్రశ్రేణి ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. దీనికి కూడా మూడు నెలల రీఛార్జ్‌పై ఒక నెల అదనపు వ్యాలిడిటీ వర్తిస్తుంది.

వినోదానికి కేరాఫ్ అడ్రస్..

జియో హోమ్ సర్వీస్ ద్వారా విడివిడిగా ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే ప్లాన్‌లో ఇంటర్నెట్, వినోదాన్ని జియో అందిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఈ ప్లాన్ ద్వారా హై-డెఫినిషన్ నాణ్యతతో వీక్షించవచ్చు. పదే పదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, తక్కువ ధరకే ఎక్కువ కాలం సేవలు పొందడం ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం.

Tags:    

Similar News