RCB vs SRH: ఇరగదీసిన ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ.. ఆర్‌సీబీ ముందు భారీ టార్గెట్!

RCB vs SRH: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. ఆర్‌సీబీ ముందు 202 రన్స్ టార్గెట్ ఉంది.

Update: 2026-03-28 16:03 GMT

Ishan Kishan

RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఆరంభమైంది. లీగ్ మొదటి మ్యాచ్‌లో ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) టీమ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. ఆర్‌సీబీ ముందు 202 రన్స్ టార్గెట్ ఉంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. వరల్డ్ కప్ 2026 ఫామ్ కొనసాగిస్తూ పరుగుల వరద పారించాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 80 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అనికేత్ వర్మ (43; 18 బంతుల్లో 3x4, 4x6) దంచి కొట్టాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్స్ తీశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బౌలింగ్ అటాక్‌ను జాకబ్‌ డఫీ ప్రారంభించగా.. సిక్స్‌తో అభిషేక్‌ శర్మ పరుగుల ఖాతా తెరిచాడు. రెండో ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ 10 రన్స్ ఇచ్చాడు. మూడో ఓవర్లో జాకబ్‌ డఫీ హైదరాబాద్‌కు వరుస షాకులు ఇచ్చాడు. మొదటి బంతికి అభిషేక్‌ (7)ను అవుట్ చేసాడు. కీపర్ జితేశ్‌ శర్మకు అద్భుత క్యాచ్ పట్టాడు. చివరి బంతికి ట్రావిస్ హెడ్‌ (11)ను వెనక్కి పంపాడు. ఫిల్‌ సాల్ట్‌కు హెడ్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ రెడ్డి వచ్చారు. నాలుగో ఓవర్లో భువీ లైన్‌ అండ్‌ లెన్త్‌తో బంతులేయగా.. ఐదో ఓవర్లో డఫీ మరో షాక్ ఇచ్చాడు. నితీశ్‌ కుమార్(1)ను క్యాచ్‌ అవుట్ చేశాడు. దాంతో హైదరాబాద్‌ 29 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో ఇషాన్‌ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌ జట్టును ఆదుకున్నారు. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్స్ ఆడారు. ముఖ్యంగా ఇషాన్ బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 10 ఓవర్లకు 87/3గా నిలిచింది. ఇషాన్ గేర్ మార్చి 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోర్ వేగంగా పరుగెడుతున్న సమయంలో షెఫర్డ్‌ ఆర్‌సీబీకి బ్రేక్ ఇచ్చాడు. ఫిల్‌ సాల్ట్‌ అద్భుత క్యాచ్ పట్టడంతో క్లాసెన్‌ (31) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో సలీల్ అరోరా (9) అవుట్ అయ్యాడు. ఆపై ఇషాన్‌ కిషన్‌, హర్ష్‌ దుబె (3) పెవిలియన్ చేరారు. ఈ సమంయంలో అనికేత్ వర్మ మెరుపులు మెరిపించాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోర్ చేసింది.

Tags:    

Similar News