MI-IPL 2026: ఐపీఎల్ 2026 ముందు ముంబైకి భారీ షాక్.. బుమ్రాతో పాటు ఆ ఇద్దరు ప్లేయర్స్ అవుట్?
MI-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు భారీ షాక్ తగలనుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆడనున్న తొలి మ్యాచ్‌కు ముగ్గరు కీలక ప్లేయర్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
MI IPL 2026
MI-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు భారీ షాక్ తగలనుందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఆడనున్న తొలి మ్యాచ్‌కు ముగ్గరు కీలక ప్లేయర్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు విదేశీ ఆల్‌రౌండర్లు విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్ అందుబాటులో ఉండడం సందేహంగా మారింది.
రిపోర్టుల ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్‌లు ముంబై ఇండియన్స్ తప్పనిసరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. దీంతో వారి అందుబాటుపై అనుమానాలు మరింత పెరిగాయి. అయితే బుమ్రా మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశముందని సమాచారం ఉన్నప్పటికీ.. అతను జట్టుతో ఎప్పుడు చేరుతాడన్నది ఇంకా స్పష్టత లేదు. ఇటీవల అతడికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్టులు చేసినట్లు తెలిసింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. మరోవైపు విల్ జాక్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఈ ఇద్దరూ ముంబై జట్టుతో చేరారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, అల్లాహ్ ఘజన్‌ఫర్ లేదా కార్బిన్ బోష్‌లకు తొలి మ్యాచ్‌లో అవకాశం లభించే ఛాన్స్ ఉంది. ఆసక్తికరంగా రూథర్‌ఫోర్డ్, ఘజన్‌ఫర్ గతంలో కేకేఆర్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మరోవైపు కేకేఆర్ జట్టు కూడా గాయాల సమస్యతో ఇబ్బందులు పడుతోంది. హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ ఇప్పటికే టోర్నమెంట్‌కు దూరమవగా.. శ్రీలంక పేసర్ మతీష పతిరణ ఇంకా జట్టుతో కలవలేదు. ఈ నేపథ్యంలో రెండు జట్లు గాయాల సమస్యలతోనే తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. కీలక ఆటగాళ్ల గైర్హాజరు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబై, కోల్‌కతా మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.