Health: ఉదయం లేవగానే నోరు ఎండిపోవడం, దుర్వాసన వస్తుందా? శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతం ఇదే

Health: ఉదయం నిద్రలేచిన వెంటనే నోరు ఎండిపోయినట్లు అనిపించడం, దుర్వాసన రావడం చాలా మందికి జరుగుతుంది.

Update: 2026-03-26 09:31 GMT

Health: ఉదయం లేవగానే నోరు ఎండిపోవడం, దుర్వాసన వస్తుందా? శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతం ఇదే

Health: ఉదయం నిద్రలేచిన వెంటనే నోరు ఎండిపోయినట్లు అనిపించడం, దుర్వాసన రావడం చాలా మందికి జరుగుతుంది. ఇది సాధార‌ణ‌మే అయితే కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలో జరుగుతున్న కొన్ని సమస్యల సంకేతంగా ఉండొచ్చు. నిపుణుల ప్రకారం నోరు ఎండిపోవడం వెనుక డీహైడ్రేషన్, నిద్ర సమస్యలు, జీర్ణక్రియ లోపాలు వంటి కారణాలు ఉండవచ్చు.

నిపుణులు ఏమంటున్నారు?

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, మనం నిద్రపోయే సమయంలో లాలాజలం (సలైవా) ఉత్పత్తి సహజంగా తగ్గుతుంది. ఈ లాలాజలం నోటిని శుభ్రంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది, ఆహారపు చిన్న కణాలను తొలగిస్తుంది. నిద్ర సమయంలో లాలాజలం తగ్గిపోతే నోటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే నోరు ఎండిపోవడం, దుర్వాసన ఎక్కువగా వ‌స్తుంది.

డీహైడ్రేషన్ కూడా ప్రధాన కారణం

శరీరంలో నీటి కొరత ఉండటం కూడా ఈ సమస్యకు ముఖ్యమైన కారణం. శరీరంలో నీరు తగ్గితే, శరీరం ముఖ్యమైన అవయవాలకు ముందుగా నీటిని అందిస్తుంది. దాంతో నోటిలో లాలాజలం తయారీ తగ్గిపోతుంది. అలాగే

రాత్రి సమయంలో కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం, మద్యం సేవించడం, ఎయిర్ కండిషనర్ గదిలో ఎక్కువసేపు నిద్రపోవడం వంటి కారణాల వల్ల నోరు త్వరగా ఎండిపోతుంది.

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం

కొంతమందికి ముక్కు బ్లాక్ అవడం, అలర్జీలు వంటి కారణంగా నోటితో శ్వాస తీసుకునే అలవాటు ఉంటుంది. ఇలా నోటితో శ్వాస తీసుకుంటే నోటిలో తేమ తగ్గి త్వరగా ఎండిపోతుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన ఎక్కువగా వస్తుంది.

నిద్ర నాణ్యత ప్రభావం

నిద్ర సరిగా లేకపోయినా ఈ సమస్య కనిపిస్తుంది. రాత్రి నిద్ర తరచూ మేల్కొనడం లేదా గాఢంగా నిద్రపోకపోతే నర్వస్ సిస్టమ్ ప్రభావితమవుతుంది. దాంతో లాలాజలం ఉత్పత్తి మరింత తగ్గుతుంది. అందుకే నిద్ర సరిగా లేని వారిలో ఉదయం నోరు ఎండిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది.

జీర్ణక్రియ సమస్యలు, ఒత్తిడి ప్రభావం

కొన్ని సందర్భాల్లో నోటిలో దుర్వాసనకు కారణం జీర్ణక్రియ సమస్యలు కూడా కావచ్చు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరంలో కొన్ని పదార్థాలు చేరి శ్వాస ద్వారా బయటకు వస్తాయి. దాంతో దుర్వాసన వస్తుంది. వీటితో పాటు

యాసిడ్ రిఫ్లక్స్, త‌ప్పుడు ఆహారపు అలవాట్లు, ఎక్కువ మానసిక ఒత్తిడి వంటివి కూడా కార‌ణాలు అవుతాయి. అలాగే అలాగే కొన్ని మందులు కూడా నోరు ఎండిపోవడానికి కారణమవుతాయి. ముఖ్యంగా అలర్జీ మందులు (యాంటీహిస్టామిన్స్), బ్లడ్ ప్రెషర్ మందులు లాలాజలం ఉత్పత్తిని తగ్గించవచ్చు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు వైద్యుల సూచ‌న‌ల‌కు ప్ర‌త్యామ్నాయం కాదు. కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఉదయం తరచూ నోరు ఎండిపోవడం, దుర్వాసన రావడం కొనసాగితే దాన్ని చిన్న సమస్యగా తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News