హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వెళ్లొచ్చే బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు.. ఈ సమ్మర్‌లో అస్స‌లు మిస్ అవ్వ‌కండి

Hyderabad Best Tourist Places: హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రకృతి అందాలతో నిండిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2026-03-24 14:22 GMT

హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో వెళ్లొచ్చే బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు.. ఈ సమ్మర్‌లో అస్స‌లు మిస్ అవ్వ‌కండి

Summer Holidays Trips: సమ్మర్ హాలీడేస్‌లో ట్రిప్స్ వెళ్ల‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే లాంగ్ టూర్స్ కాకుండా జ‌స్ట్ ఒక్క రోజులో ట్రిప్ ప్లాన్ చేసే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారికోసం హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రకృతి అందాలతో నిండిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆక్టోప‌స్ వ్యూపాయింట్

హైద‌రాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో దోమ‌ల‌పెంట ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌కి ముందు ఈ ఆక్టోపస్ వ్యూపాయింట్ ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే లోయలు, పచ్చని అడవులు, అలాగే కృష్ణా నది బ్యాక్‌వాటర్స్ అద్భుతంగా కనిపిస్తాయి.

పైనుంచి చూసినప్పుడు ప్రకృతి అందాలు ఆక్టోపస్ ఆకారంలా కనిపిస్తాయని అందుకే దీనికి ఆక్టోప‌స్ వ్యూ పాయింట్ అనే పేరు వచ్చింది. ఫోటోగ్రఫీకి, ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి ఇది మంచి ప్రదేశం.

ల‌క్న‌వ‌రం లేక్

లక్నవరం సరస్సు తెలంగాణలోని అందమైన టూరిస్ట్ స్పాట్లలో ఒకటి. ఈ సరస్సు చుట్టూ పచ్చని కొండలు, అడవులు ఉంటాయి. ముఖ్యంగా ఈ సరస్సులో సుమారు 13 చిన్న దీవులు ఉన్నాయి. వాటిని కలుపుతూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ సరస్సు అందాలు చూడటం చాలా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కుటుంబంతో పిక్నిక్‌కు వెళ్లడానికి ఇది మంచి ప్రదేశం. హైదరాబాద్ నుంచి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సింగూర్ డ్యామ్

సింగూర్ డ్యామ్ మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర మంజీరా నదిపై నిర్మించారు. హైదరాబాద్‌కు తాగునీరు అందించే ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇక్కడ విస్తారంగా కనిపించే బ్యాక్‌వాటర్స్, చుట్టూ పచ్చని పొలాలు, పక్షుల సంచారం ఈ ప్రాంతాన్ని చాలా అందంగా చూపిస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో వలస పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి సుమారు 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొయిల‌సాగ‌ర్ డ్యామ్

కొయిలసాగర్ డ్యామ్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. కొండల మధ్యలో ఉండే ఈ డ్యామ్ చుట్టూ పచ్చని ప్రకృతి కనిపిస్తుంది. డ్యామ్ నీటితో నిండినప్పుడు ఇక్కడి దృశ్యం మరింత అందంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం, ఫోటోలు తీయడం, క్యాంపింగ్ చేయడం వంటి కార్యకలాపాలకు ఇది మంచి ప్రదేశం. హైదరాబాద్ నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

స‌ర్ప‌న్‌ప‌ల్లి స‌ర‌స్సు

సర్పన్‌పల్లి సరస్సు చాలా ప్రశాంతంగా ఉండే ప్రదేశం. నగర శబ్దాల నుంచి దూరంగా వెళ్లి కొంత సమయం ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఇది సరైన స్పాట్. ఇక్కడ ఎక్కువగా ఫోటోగ్రఫీ, పిక్నిక్, సాయంత్రం సూర్యాస్తమయం చూడటానికి ప్రజలు వస్తుంటారు. ప్రకృతి మధ్యలో రిలాక్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. హైదరాబాద్ నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Tags:    

Similar News