Health Tips: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క పని చేస్తే గుండెపోటు, క్యాన్సర్ ముప్పు నుంచి విముక్తి!

Alcohol and Exercise: మద్యం తాగే అలవాటు ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అకాల మరణం ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చని తేలింది.

Update: 2026-03-22 12:36 GMT

Health Tips: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క పని చేస్తే గుండెపోటు, క్యాన్సర్ ముప్పు నుంచి విముక్తి!

Alcohol and Exercise: ఈ రోజుల్లో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం మారుతున్న జీవనశైలితో పాటు మితిమీరిన మద్యపానం అని వైద్యులు చెబుతున్నారు. అయితే, బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక సరికొత్త పరిశోధన ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. మద్యం తాగే అలవాటు ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో అకాల మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధన ఫలితాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏమిటీ పరిశోధన..

శారీరక శ్రమ అనేది మద్యం వల్ల కలిగే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును ఎంతవరకు తగ్గిస్తుందనే అంశంపై ఈ రీసెర్చ్ జరిగింది. దీని కోసం పరిశోధకులు.. కొందరు వ్యక్తులను వారు తాగే మద్యం పరిమాణం, వారు చేసే వ్యాయామం ఆధారంగా వేర్వేరు గ్రూపులుగా విభజించి అధ్యయనం చేశారు. వ్యాయామం చేయకుండా, విపరీతంగా మద్యం తాగే వారిలో క్యాన్సర్, గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉందని తేలింది. తక్కువ పరిమాణంలో మద్యం తాగినప్పటికీ, అస్సలు శారీరక శ్రమ లేని వారిలో కూడా అనారోగ్య సమస్యలు అధికంగానే ఉన్నట్ల వెల్లడైంది. మద్యం తాగే అలవాటు ఉండి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో మాత్రం అనారోగ్యాల వల్ల వచ్చే మరణాల ముప్పు గణనీయంగా తగ్గిందని పరిశోధకులు తెలిపారు. వ్యాయామం అనేది మద్యం వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

మద్యం శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా..

ఆల్కహాల్ మన జీర్ణక్రియపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపును పెంచుతుందన్నారు. అంతేకాకుండా, ఫ్యాట్ మెటబాలిజంను దెబ్బతీయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి హై బీపీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 18 నుంచి 64 ఏళ్ల వయస్సు వారు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం (బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్ వంటివి) చేయాలి. వ్యాయామం ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తుందని చెప్పినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మద్యం తాగమని దీని అర్థం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే మద్యపానానికి దూరంగా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం అన్నింటికంటే ఉత్తమ మార్గం అని సూచించారు.

Similar News