Health: ఉదయం లేవగానే తల బరువుగా ఉంటోందా.? దీనికి కారణం ఏంటంటే
Health: చాలామందికి ఉదయం నిద్రలేవగానే తల బరువుగా, అలసటగా లేదా మత్తుగా అనిపిస్తుంది. చాలా మంది దీనిని సాధారణ అలసటగా భావించి పట్టించుకోరు. కానీ ఈ సమస్య తరచుగా వస్తుంటే శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఇంతకీ ఉదయం లేవగానే తల భారంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా.?
Health: ఉదయం లేవగానే తల బరువుగా ఉంటోందా.? దీనికి కారణం ఏంటంటే
Health: చాలామందికి ఉదయం నిద్రలేవగానే తల బరువుగా, అలసటగా లేదా మత్తుగా అనిపిస్తుంది. చాలా మంది దీనిని సాధారణ అలసటగా భావించి పట్టించుకోరు. కానీ ఈ సమస్య తరచుగా వస్తుంటే శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఇంతకీ ఉదయం లేవగానే తల భారంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా.?
సరైన నిద్ర లేకపోవడం
డాక్టర్ల ప్రకారం ఉదయం తల బరువుగా అనిపించడానికి ప్రధాన కారణం సరిపడ నిద్ర లేకపోవడం. రాత్రి ఎక్కువసేపు మేల్కొని ఉండటం, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. నిద్ర సరిగా లేకపోతే మెదడు పూర్తిగా విశ్రాంతి పొందదు. ఫలితంగా ఉదయం లేవగానే తల బరువుగా అనిపిస్తుంది.
డీహైడ్రేషన్ కూడా కారణం కావచ్చు
రోజంతా తగినంత నీరు తాగకపోతే శరీరంలో నీటి లోపం ఏర్పడుతుంది. దీనిని డీహైడ్రేషన్ అంటారు. ఈ పరిస్థితిలో ఉదయం లేవగానే తల నొప్పి లేదా తల బరువుగా అనిపించవచ్చు. ప్రత్యేకంగా వేసవిలో నీటి లోపం ఎక్కువగా ఉంటే ఈ సమస్య మరింతగా కనిపిస్తుంది.
కొన్ని ఆరోగ్య సమస్యల సంకేతం
ఉదయం తల బరువుగా అనిపించడం కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఉదాహరణకు సైనస్ సమస్య, మైగ్రేన్, హై బ్లడ్ ప్రెషర్, రక్తహీనత (అనీమియా) వంటి పరిస్థితుల్లో తలనొప్పి లేదా తల బరువు ఎక్కువసేపు కొనసాగుతుంది. అలాగే తప్పు దిండుతో నిద్రపోవడం లేదా తల మెడకు సరైన స్థానం లేకపోవడం కూడా కారణం అవుతుంది.
జీవనశైలి అలవాట్లు కూడా..
రాత్రి ఎక్కువగా కాఫీ లేదా టీ తాగడం, చాలా భారమైన భోజనం చేయడం, ఎక్కువగా మసాలా ఆహారం తినడం వంటి అలవాట్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా ఉదయం తల బరువుగా అనిపించడానికి కారణం అవుతుంది.
ఎలా నివారించాలి?
ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగం తగ్గించాలి. రోజంతా తగినంత నీరు తాగడం, రాత్రి తేలికపాటి భోజనం చేయడం,
వ్యాయామం, యోగ, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఉదయం లేవగానే తల నొప్పి సాధారణ సమస్యే అయినా దీర్ఘకాలం ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా తల బరువుతో పాటు తల తిరగడం, వాంతులు, కళ్ల ముందు మసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.