Turmeric Milk: పసుపు పాలు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ!

పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే, కానీ కొన్ని తప్పులు చేస్తే జీర్ణ సమస్యలు తప్పవు. పసుపు పాలు తాగడానికి సరైన సమయం ఏది? నిద్రపోయే ముందు తాగితే వచ్చే నష్టాలేంటి? పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-24 11:23 GMT

Turmeric Milk: పసుపు పాలు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ!

Turmeric Milk: భారతీయుల వంటింట్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ గుణాలున్న పసుపును పాలతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది దీనిని రోజూవారి అలవాట్లలో భాగం చేసుకున్నారు. అయితే పసుపు పాలు తాగే విషయంలో మనం చేసే కొన్ని తప్పులు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పసుపులో ఉండే 'కర్కుమిన్' అనే పదార్థం కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్, జింక్ ఎముకలను బలోపేతం చేస్తాయని వెల్లడించారు. ఇన్ని పోషకాలున్న ఈ పసుపు కలిపిన పాల విషయంలో నిపుణులు చెబుతున్న జాగ్రత్తలు ఇవే..

* తాగిన వెంటనే నిద్రపోకండి

చాలామంది పసుపు పాలు తాగిన వెంటనే పడుకుంటారు. ఇది పెద్ద పొరపాటని నిపుణులు చెబుతున్నారు. పాలు జీర్ణం కావడానికి సమయం పడుతుందని, మీరు పాలు తాగిన వెంటనే పడుకుంటే, మీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా జీర్ణక్రియపై పని చేయాల్సి వస్తుందని వెల్లడించారు. దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడమే కాకుండా, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందని చెప్పారు.

* అసిడిటీ సమస్య ఉన్నవారు జాగ్రత్త..

ఇప్పటికే అసిడిటీ, గుండెల్లో మంట లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు రాత్రి ఆలస్యంగా పసుపు పాలు తాగడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇది గొంతులో చికాకును కూడా కలిగించవచ్చని హెచ్చరించారు. అలాగే పాల ఉత్పత్తులు సరిపడని వారు రాత్రిపూట పసుపు పాలు తాగడం వల్ల గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇలాంటి వారు పసుపు పాలకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం అని సూచించారు.

పసుపు పాలు తాగడానికి సరైన సమయం ఇదే..

పసుపు పాలు తాగడం వల్ల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే.. రాత్రి భోజనం చేసిన ఒకటి నుంచి ఒకటిన్నర గంటల తర్వాత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడటమే కాకుండా శరీరానికి విశ్రాంతినిస్తుందని అన్నారు. అలాగే మార్కెట్లో లభించే కల్తీ పసుపు కాకుండా, స్వచ్ఛమైన పసుపును వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం అని సూచించారు.

Tags:    

Similar News