Hair Care Tips: జుట్టు సమస్యలకు ఈ 5 సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!
Hair Care Tips: జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? వైద్య నిపుణులు సూచించిన ఈ 5 సూపర్ ఫుడ్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
Hair Care Tips: జుట్టు సమస్యలకు ఈ 5 సూపర్ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి!
Hair Care Tips: ఈ రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యలు రాగానే మనం వెంటనే షాంపూలు మార్చడమో లేదా ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేయించుకోవడమో చేస్తుంటాం. కానీ, జుట్టు ఆరోగ్యం మనం తినే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైన పూసే నూనెలు, షాంపూలు సరిపోవు.. లోపలి నుంచి సరైన పోషకాలు అందడం చాలా ముఖ్యం. శరీరంలో విటమిన్లు లేదా ఖనిజాల లోపం ఏర్పడినప్పుడు ఆ ప్రభావం ముందుగా జుట్టుపైనే కనిపిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా జుట్టును స్ట్రాంగ్‌గా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీకు జుట్టు ఎక్కువగా రాలుతుంటే డైట్‌లో పాలకూరను చేర్చుకోండి. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి, జుట్టు పెరగడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి పాలకూర ఉత్తమ ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఇబ్బంది పెడుతుంటే కరివేపాకును వాడాలని సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతాయని, క్రమంగా కరివేపాకును ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టు సహజ రంగును కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
జుట్టు నిర్జీవంగా, పొడిగా కనిపిస్తుంటే అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నారు. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు స్కాల్ప్‌కు తేమను అందిస్తాయని, దీనివల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ తయారవుతుందని చెబుతున్నారు. చుండ్రు సమస్యకు పెరుగు మంచి పరిష్కారంగా పని చేస్తుందని వెల్లడించారు. ఇందులో ఉండే ప్రోటీన్లు, ప్రోబయోటిక్స్ స్కాల్ప్ వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి. ఇది కేవలం జుట్టుకే కాదు, జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వెల్లడించారు. జుట్టు పీచులా మారి త్వరగా తెగిపోతుంటే బాదం పప్పును తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఉండే బయోటిన్, విటమిన్ ఇ జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయని పేర్కొన్నారు. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు మంచి నిగారింపునిస్తాయని చెప్పారు. కేవలం బాహ్య చికిత్సలపైనే కాకుండా, రోజువారీ పోషకాహారంపై దృష్టి పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని చెబుతున్నారు. శరీరం లోపలి నుంచి అందే పోషకాలే జుట్టుకు అసలైన బలాన్నిస్తాయని వెల్లడించారు.